రోడ్డు పక్కన ట్రక్కులో 2 లక్షలకు పైగా డోసుల వ్యాక్సిన్, పత్తా లేని, డ్రైవర్, క్లీనర్, ఎక్కడంటే ?

| Edited By: Phani CH

May 01, 2021 | 4:30 PM

మధ్యప్రదేశ్ లోని నర్సింగాపూర్ జిల్లాలో ఓ బస్టాండ్ వద్ద ఓ భారీ ట్రక్కు గంటలతరబడి పార్క్ చేసి ఉంది. ఎంతసేపు చూసినా అది అక్కడినుంచి కదలలేదు. స్థానికులకు ఆశ్చర్యం కలిగి  ఈ  వాహనం  గురించిన సమాచారాన్ని పోలీసులకు  తెలియజేశారు.

రోడ్డు పక్కన ట్రక్కులో 2 లక్షలకు పైగా డోసుల వ్యాక్సిన్, పత్తా లేని, డ్రైవర్, క్లీనర్, ఎక్కడంటే ?
2 Lakh Covid Vaccine Abandoned In Madhyapradesh
Follow us on

మధ్యప్రదేశ్ లోని నర్సింగాపూర్ జిల్లాలో ఓ బస్టాండ్ వద్ద ఓ భారీ ట్రక్కు గంటలతరబడి పార్క్ చేసి ఉంది. ఎంతసేపు చూసినా అది అక్కడినుంచి కదలలేదు. స్థానికులకు ఆశ్చర్యం కలిగి  ఈ  వాహనం  గురించిన సమాచారాన్ని పోలీసులకు  తెలియజేశారు.ఈ వాహన డ్రైవర్, క్లీనర్ కోసం చూస్తే  వారు కూడా కనబడలేదు. చివరకు పోలీసులు వచ్చి ఈ ట్రక్ లో చూడగా ఇందులో 2 లక్షల డోసులకు పైగా కొవాగ్జిన్ వ్యాక్సిన్ కనబడింది.  అసలే కోవిడ్ మహమ్మారి విజృభించిన  తరుణంలో ఇంత వ్యాక్సిన్ తో కూడిన ఈ ట్రక్కు ఇలా ఉండిపోవడం వారికి ఆశ్చర్యాన్ని, ఆందోళనను కూడా కలిగించింది. వాహనంలోని ఎయిర్ కండిషన్ ఇంకా పని చేస్తూనే ఉండడంతో ఈ వ్యాక్సిన్ బాగానే ఉంది. ట్రక్కు డ్రైవర్ కోసం గాలించగా అక్కడికి కొద్దీ దూరంలో ఓ పొదల్లో అతని మొబైల్ ఫోన్ కనిపించిందట. కానీ డ్రైవర్ గానీ క్లీనర్ గానీ పోలీసులకు  ఎక్కడా కనబడలేదు. ఈ వాహనంలో 8 కోట్ల రూపాయల విలువైన వ్యాక్సిన్ ఉందని వారు చెప్పారు. ఇంత విలువైన టీకామందును తీసుకు వెళ్తున్న డ్రైవర్ నిర్లక్ష్యంగా దీన్ని ఎలా వదిలి వెళ్లాడన్నది మిస్టరీగా ఉంది. ఈ వాహనంలో మొత్తం రెండు లక్షల 40 వేల డోసుల  టీకామందు ఉన్నట్టు నిర్ధారించారు.  డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడో తెలియడంలేదని ఖాకీలు అంటున్నారు. అతనికోసం గాలిస్తున్నామన్నారు.

ఇక మధ్యప్రదేశ్ కూడా పెరిగిపోతున్న కోవిడ్ కేసులతో తల్లడిల్లుతోంది. ఈ  కారణంగా పొరుగునున్న రాష్ట్రాలతో తమ సరిహద్దులను మూసి వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే ఈ రాష్ట్రాల నుంచి  ప్యాసింజర్ బస్సు సర్వీసులను ఈ నెల 7 వరకు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ తో బాటు 5 ర్రాష్ట్రాలతో మధ్యప్రదేశ్ కి సరిహద్దులు ఉన్నాయి.   రాష్ట్రంలో 13 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Cheap Thief: వీడి కక్కుర్తి పాడుకానూ..ఈ మహానుభావుడు ఏటీఎంలో ఏమి దొంగిలించాడో తెలిస్తే మీరు కచ్చితంగా అబ్బా..ఛీ అంటారు!

Vaccine Second Dose: క‌రోనా సెకండ్ డోస్ ఆల‌స్య‌మ‌వుతోంద‌ని టెన్ష‌న్ అవుతున్నారా.? ఏం ప‌ర్లేదు అంటోన్న నిపుణులు..