Maha Dharna: ఢిల్లీపై గులాబీ దండయాత్ర.. రైతుల పక్షాన దీక్షకు దిగుతున్న సీఎం కేసీఆర్‌..

|

Apr 11, 2022 | 8:52 AM

Paddy Procurement: ధాన్యం దంగల్‌..ఢిల్లీపై గులాబీ దండయాత్ర.. దేశ రాజధాని వేదికగా సమరశంఖం పూరిస్తోంది టీఆర్‌ఎస్‌(TRS).. తెలంగాణ ఉద్యమం తర్వాత ఢిల్లీలో తొలిసారిగా ఆందోళనలు నిర్వహిస్తోంది. తెలంగాణలో పండిన ప్రతి ధాన్యం గింజను కొనాల్సిందేనని పోరుబాట పట్టింది.

Maha Dharna: ఢిల్లీపై గులాబీ దండయాత్ర.. రైతుల పక్షాన దీక్షకు దిగుతున్న సీఎం కేసీఆర్‌..
Telangana Bhavan Delhi
Follow us on

ధాన్యం దంగల్‌..ఢిల్లీపై గులాబీ దండయాత్ర.. దేశ రాజధాని వేదికగా సమరశంఖం పూరిస్తోంది టీఆర్‌ఎస్‌(TRS).. తెలంగాణ ఉద్యమం తర్వాత ఢిల్లీలో తొలిసారిగా ఆందోళనలు నిర్వహిస్తోంది. తెలంగాణలో పండిన ప్రతి ధాన్యం గింజను కొనాల్సిందేనని పోరుబాట పట్టింది. ఇప్పటికే రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తున్న గులాబీ దండు.. ఇవాళ ఢిల్లీ వేదికగా కేంద్రంతో అమీతుమీ తేల్చుకోబోతోంది. కాసేపట్లో సీఎం కేసీఆర్‌(CM KCR) దీక్షకు దిగనున్నారు. ముందుగా ఏపీ భవన్‌లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం దీక్షలో కూర్చుంటారు సీఎం కేసీఆర్‌. ఈ రైతు దీక్షలో పాల్గొనేందుకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సహా పలువురు తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు మొత్తం 1500మంది వరకు ధాన్యం కొనుగోళ్లపై గళమెత్తనున్నారు.

రైతుల పక్షాన దీక్షకు దిగుతున్న సీఎం కేసీఆర్‌.. బీకేయూ నేత రాకేష్‌ టికాయత్‌ను కూడా ఈ దీక్షకు ఆహ్వానించారు. దీంతో ఇవాల్టి దీక్షకు మద్దతు ప్రకటించిన రాకేష్‌ టికాయత్‌ కూడా.. ఈ ధర్నాలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది.

జాతీయ స్థాయిలో ఒకే ధాన్యం సేకరణ పాలసీకి డిమాండ్‌ చేస్తున్నారు గులాబీ నేతలు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో కేంద్రం విఫలమయిందని..కేంద్రం తీరుకు నిరసనగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆందోళన చేస్తున్నామన్నారు. రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు ఏర్పడిందని విమర్శించారు. ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వ బాధ్యతని..కానీ వరి కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఫైరవుతున్నారు.

 ఇవి కూడా చదవండి: AP New Cabinet: ఇవాళ కొలువుదీరనున్న జగన్ నూతన మంత్రివర్గం.. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం..