Tomatoes Price: వామ్మో.. అక్కడ కేజీ టమాటా ధర రూ.160

|

Jul 02, 2023 | 9:51 PM

దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటా ధరలు మండిపోతున్నాయి. ఇప్పిటకే చాలా చోట్లు కిలో టమాటా ధర రూ.100 దాటింది. అయితే మధ్యప్రదేశ్‌లోని రైజెన్ అనే జిల్లాలో టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్కడ కిలో టమాటా ధర ఏకంగా 160 రూపాయలు పలుకుతోంది.

Tomatoes Price: వామ్మో.. అక్కడ కేజీ టమాటా ధర రూ.160
Tomato Price Hike
Follow us on

దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటా ధరలు మండిపోతున్నాయి. ఇప్పిటకే చాలా చోట్లు కిలో టమాటా ధర రూ.100 దాటింది. అయితే మధ్యప్రదేశ్‌లోని రైజెన్ అనే జిల్లాలో టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్కడ కిలో టమాటా ధర ఏకంగా 160 రూపాయలు పలుకుతోంది. దీనివల్ల స్థానిక ప్రజలు, ముఖ్యంగా గృహిణులు ఆందోళన చెందుతున్నారు. అలాగే మధ్యప్రదేశ్ ఇంకా వేరే చోట్లు కిలో టమాటా ధరలు భిన్నంగా ఉన్నాయి. పలు ప్రాంతాల్లో కిలో టమాటా ధర రూ.120 నుంచి రూ.150 మధ్య ఉంది.

అయితే ట‌మాటా ధ‌ర‌లు పెరిగిన నేప‌థ్యంలో రైజెన్ జిల్లా క‌లెక్టర్ అర‌వింద్ దూబే కీలక వ్యాఖ్యలు చేశారు. ట‌మాటాల‌కు కొర‌త ఏర్పడటం వల్లే ధ‌ర‌లు పెరిగాయ‌న్నారు. ఏవైనా కూర‌గాయ‌ల‌కు డిమాండ్ త‌క్కువ‌గా ఉండి, ఉత్పత్తి ఎక్కువ‌గా ఉంటే ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ట‌మాటా స‌ర‌ఫ‌రా త‌గ్గిపోవ‌డంతో.. ధ‌ర‌లు పెరిగాయ‌న్నారు. ట‌మాటా ధ‌ర‌లు పెర‌గ‌డం ఒక్క ఈ జిల్లాలోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఇలాంటి ప‌రిస్థితే ఉంద‌ని గుర్తు చేశారు. మరోవైపు ట‌మాటా ధర‌లు పెర‌గ‌డానికి ద‌ళారులే కార‌ణ‌మ‌ని రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ద‌ళారులు త‌మ వ‌ద్ద కిలో రూ. 20కి కొనుగోలు చేసి, అధిక ధ‌ర‌ల‌కు విక్రయిస్తున్నార‌ని ఆగ్రహం వ్తక్తం  చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి