
ఇటీవల పేపర్ లీక్ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించడంతో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహరంపై సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు తావులేకుండా పరీక్షా వ్యవస్థలో సాంకేతిక, నిర్మాణాత్మక సంస్కరణల కోసం వివిధ రంగాల నిపుణులతో హై-పవర్డ్ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియోలో స్పష్టం చేశారు.
మొత్తం ఆరుగురు సభ్యులతో కలిపి కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్‌గా టెక్ దిగ్గజం నందన్ నిలేకనినీ నియమిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆయనతో పాటు ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్, IB మాజీ డైరెక్టర్ తపన్ డేకా, మద్రాస్ IIT డైరెక్టర్ కామకోటి, విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కర్వాల్, లాజిస్టిక్స్, పరిపాలనా నిపుణులు అమృత్ లాల్ మీనా ఉన్నారు.
కమిటీ చైర్మన్, సభ్యులు ప్రత్యేకలు
నందన్ నీలేకని: ఈయన ప్రముఖ సాంకేతిక నిపుణుడు, ఆధార్ ప్రాజెక్ట్‌ను రూపొందించింది కూడా ఈయనే.. పరీక్షా విధానంలో డిజిటల్ భద్రత, అధునాతన సాంకేతికత వినియోగంపై ఈయన పనిచేయనున్నారు.
ఎస్. సోమనాథ్: ఈయన గతంలో ఇస్రో ఛైర్మన్‌గా దేశానికి సేవలు అందించారు. క్లిష్టమైన ప్రాసెస్ ఆటోమేషన్, సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌పై మార్గదర్శకత్వం సోమనాథ్ పనిచేయనున్నారు.
తపన్ దేకా: ఈయన గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ కమిటీలో ప్రశ్నాపత్రాల భద్రత, సైబర్ భద్రత, లీకేజీల నివారణపై పనిచేయనున్నారు.
ప్రొఫెసర్ వి. కామకోటి: ఈ IIT మద్రాస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ కమిటీ సభ్యులతో కలిసి సాంకేతిక పరీక్షా విధానాలు, సైబర్ సెక్యూరిటీ, AI వినియోగంపై ప్రత్యేకంగా పనిచేయనున్నారు.
అనితా కర్వాల్: ఈమే మాజీ విద్యాశాఖ కార్యదర్శి ప్రస్తుతం ఈ కమిటీలో విద్యార్థుల దృక్పథం, విద్యా విధానాలు, బోర్డు పరీక్షల సమన్వయం చూసుకోనున్నారు.
అమృత్ లాల్ మీనా: ఈయన లాజిస్టిక్స్ నిపుణులు.. దేశవ్యాప్తంగా విరామం లేని, సురక్షితమైన రవాణా, పరీక్షా కేంద్రాల నిర్వహించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.