
బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర విషాదం వెలుగుచూసింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. శనివరాం స్వాతంత్ర్య దినోత్సవ స్థానికంగా వేడుకల్లో పాల్గొని హుషారుగా కనిపించిన ఆయన ఆదివారం తెల్లవారుజామున రాంపూర్‌హాట్‌లోని తన నివాసానికి సమీపంలో ఉన్న టీఎంసీ కార్యాలయంలో ఉరివేసుకొని విగతజీవిగా కనిపించారు. అది గమనించిన సిబ్బంది వెంటనే ఆయన కుటుంబ సభ్యులలో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆయన మృతదేహం పక్కనే పోలీసులకు ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది. అందులో తన రాజకీయ జీవితంలో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఎటువంటి తప్పు చేయలేదని బెనర్జీ రాసుకొచ్చారు.ఇక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి.. ఆయన మృతికి గల ఖచ్చితమైన కారణాలు తేల్చేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
బెనర్జీ రాజకీయ నేపథ్యం
తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశిష్ బెనర్జీ రాంపూర్‌హాట్ నియోజకవర్గం నుంచి 2001 నుంచి 2026 వరకు వరుసగా 25 ఏళ్ల పాటు ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి తనదైనా హవా కొనసాగించారు. అయితే, 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి ధ్రుబ సాహా చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.