పాక్ శాంతి పలుకులు… భారత్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదన్న పాక్ ఆర్మీ చీఫ్ జావేద్ బాజ్వా…

| Edited By:

Feb 03, 2021 | 6:23 PM

త‌మ‌ది శాంతికాముక దేశ‌మ‌ని, తాము భారత్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్ ఖ‌మ‌ర్‌ జావేద్ బాజ్వా ప్రక‌టించారు...

పాక్ శాంతి పలుకులు... భారత్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదన్న పాక్ ఆర్మీ చీఫ్ జావేద్ బాజ్వా...
Follow us on

త‌మ‌ది శాంతికాముక దేశ‌మ‌ని, తాము భారత్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్ ఖ‌మ‌ర్‌ జావేద్ బాజ్వా ప్రక‌టించారు. ఇరుదేశాలూ శాంతియుతంగా కలిసి సాగాలన్నదే తమ అభిమతమని అన్నారు. పాకిస్థాన్‌ వైమానిక దళానికి సంబంధించి రావల్పిండిలో జ‌రిగిన‌‌ కార్యక్రమంలో ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు. సమయం దొరికినప్పుడల్లా భారత్‌లో విధ్వంసాన్ని సృష్టించేందుకు చేసే పాక్ ఈ మాటలు మాట్లాడడంతో అంతర్జాతీయ సమాజం ఆశ్చర్యపోయింది. ఇంకా పాక్ చీఫ్ ఏమన్నారంటే..

అన్ని దేశాలకు శాంతి హస్తాన్ని అందించాల్సిన సమయం…

ప్రపంచంలోని అన్ని దేశాలకూ శాంతిహస్తాన్ని అందించాల్సిన సందర్భం ఆసన్నమైన‌ద‌ని జావేద్ బ‌జ్వా వ్యాఖ్యానించారు. అయితే దీన్ని ఎవ‌రూ పాకిస్థాన్‌ బలహీనతగా భావించవద్దని తెలిపారు. త‌న‌ ప్రకటనకు పెడార్థాలు తీయవద్దని కోరారు. ఏ దేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కేవలం అభివృద్ధిని కోరుకుంటున్నాయ‌ని, క‌శ్మీర్ అంశాన్ని ఇరుదేశాలు శాంతియుతంగా పరిష్కరించుకుంటే బాగుంటుందని సూచించారు. జమ్ముకశ్మీర్ ప్రజల అభీష్టం మేరకు కశ్మీర్ సమస్యను రెండు దేశాలూ సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. క‌య్యాల‌కు కాలు దువ్వడం కంటే పరస్పర గౌరవానికే తాము అత్యధిక ప్రాధాన్యమిస్తామ‌ని పాక్ ఆర్మీ చీఫ్ బ‌జ్వా అన్నారు.

 

Also Read: 

CAA: సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ నిబంధనలు రెడీ అవుతున్నాయి… కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ప్రకటన…

Kevin Pietersen: భారత్‌పై ఇంగ్లాండ్ ఆటగాడి ప్రశంసలు… సహృదయత కలిగిన వారు భారతీయులని కితాబు…