తమిళనాడులోని(Tamil Nadu) మదురైలో ఘోరం జరిగింది. బతుకుదెరువు కోసం పనికి వెళ్లిన వారు విగతజీవులుగా మారారు. ట్యాంకును(Tank) శుభ్రపరుస్తుండగా విషవాయువులు వెలువడంతో ఒకరు మృతి చెందారు. అతడిని కాపాడే క్రమంలో మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. మదురై కార్పొరేషన్‌లోని 70వ వార్డులో.. కార్పొరేషన్ మురుగునీటి ట్యాంక్‌లో విద్యుత్ మోటారు రిపేర్ అయింది. దీంతో మురుగునీరు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న నలుగురు ఎలక్ట్రికల్ ఇంజినీర్లు మోటారును బయటకు తీసి మరమ్మతులు చేస్తున్నారు. అదే సమయంలో ట్యాంక్ ను శుభ్రం చేస్తున్న శరవణన్ విషవాయువు ప్రభావంతో లోపల పడిపోయాడు. అతడిని రక్షించేందుకు శివకుమార్, లక్ష్మణన్ అనే ఇద్దరు కార్మికులు అతడిని రక్షించేందుకు ట్యాంక్‌లోకి దూకారు. వారు కూడా విష వాయువు బారిన పడి మృతి చెందారు. వెంటనే అప్రమత్తమైన కార్తీక్ అనే తోటి కార్మికుడు.. అధికారులకు సమాచారం అందించాడు.
అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని శివకుమార్‌ను రక్షించారు. 108 రాకపోవడంతో, ద్విచక్ర వాహనంపై ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే మృతి చెందాడు. సరైన భద్రత పరికరాలు ఇవ్వకుండానే ట్యాంక్ లోపలికి పంపించారని మృతుల కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రమాదంపై విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అనీష్ సేగర్ తెలిపారు. విచారణలో అవకతవకలకు పాల్పడినట్లు తేలితే కాంట్రాక్టర్ కాంట్రాక్టును రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
Also Read
Johnny Depp: మాజీ భార్యపై రూ. 380 కోట్ల పరువునష్టం దావా వేసిన స్టార్ హీరో..
Beauty Tips for summer: ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోతున్నారా.. అయితే ఇలా చేయండి..!