అక్కడ ప్రతీ పదేళ్లకు ముద్దుల జాతర చేసుకుంటారట..!

జాతర అంటేనే ఊరంతా సందడి.. పూజలు, పునస్కారాలు, ఊరేగింపులు, సేవలు, రథం ఇలా.. ఒక్కటేంటి? ఆ జాతర జరిగినన్ని రోజులు... రోజుకో విధమైన సేవలతో ఆ దేవతలను, అమ్మవారిని కొలుస్తారు. ఇక జాతరలో విందు వినోదాలకు కూడా కొదువన్నదే ఉండదు.. కానీ, కర్నాటకలో మాత్రం ఓ విచిత్ర జాతర నిర్వహిస్తారు..ఆ తంతు చూశారంటే..ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే...

అక్కడ ప్రతీ పదేళ్లకు ముద్దుల జాతర చేసుకుంటారట..!

Updated on: Mar 01, 2020 | 12:00 PM

జాతర అంటేనే ఊరంతా సందడి..జాతర వచ్చిందంటే చాలు… చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు. జాతర నాడు కుటుంబ సభ్యలుందరూ… పొద్దునే లేచి… స్నానాలు చేసుకుని కొత్తబట్టలు ధరించి పూజా సామాగ్రితో జాతరకు వెళ్లి తమ ఇష్టదైవాలకు మొక్కులు అప్పజెప్పుతారు. పూజలు, పునస్కారాలు, ఊరేగింపులు, సేవలు, రథం ఇలా.. ఒక్కటేంటి? ఆ జాతర జరిగినన్ని రోజులు… రోజుకో విధమైన సేవలతో ఆ దేవతలను, అమ్మవారిని కొలుస్తారు. ఇక జాతరలో విందు వినోదాలకు కూడా కొదువన్నదే ఉండదు.. కోళ్లు, మేకలను బలి ఇస్తారు. మరికొందరైతే… కొంబరికాయలతో సరిపెట్టుకుంటారు. కానీ, కర్నాటకలో మాత్రం ఓ విచిత్ర జాతర నిర్వహిస్తారు..ఆ తంతు చూశారంటే..ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే…

కర్నాటకాలోని బళ్లారి పరిసర ప్రాంతాల్లో ఓ విచిత్రమైన ఆచారం ఉందట… దావణగెర జిల్లా పరిధిలోని మాగానహళ్లి గ్రామంలో… ప్రతీ పదేళ్లకోసారి గ్రామ దేవత ఊరమ్మ దేవి జాతర నిర్వహిస్తారు.. ఈ గ్రామ దేవత జాతరలో భక్తులు జంటలుగా డ్యాన్స్‌ చేయడం, ముద్దులు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం అని చెబుతున్నారు. ఆ తిరునాళ్లకు వచ్చే భార్యాభర్తలు కలిసి డ్యాన్స్ చేయటం ఆచారమట. అంతే కాదు.. చుట్టూ జనాలంతా గుమ్మిగూడి చూస్తున్నప్పటికీ… పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకుంటూ వయసుతో సంబంధం లేకుండా భార్యభర్తలు కలిసి డ్యాన్స్ చేయటం తమ ఆచారం అంటున్నారు స్థానికులు. ఈ వింత సాంప్రదాయాన్ని పాటిస్తేనే అమ్మవారు శాంతిస్తారని.. సంతృప్తి చెందుతారని, కోరిక కోరికలు తీరుతాయని వారు నమ్మకంగా చెబుతున్నారు.