సోషల్ మీడియాలోనూ రాజకీయ పార్టీలు జోరు

కాలానుగుణంగా మారుతున్న టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి రాజకీయపార్టీలు.. సామాజిక మాధ్యమాల ద్వారా తన వాదనను, భావజాలాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నాయి.

సోషల్ మీడియాలోనూ రాజకీయ పార్టీలు జోరు
Follow us

|

Updated on: Oct 07, 2020 | 8:40 PM

కాలానుగుణంగా మారుతున్న టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి రాజకీయపార్టీలు.. సామాజిక మాధ్యమాల ద్వారా తన వాదనను, భావజాలాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నాయి. వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌.. ఇలా సోషల్‌ మీడియాను ఎక్కువగా అంటిపెట్టుకుని ఉండేది యువతే. దేశ రాజకీయాలను మార్చే శక్తి కూడా యువతకే ఉంది. అలాంటి యువత దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకు ఆయా రాజకీయ పార్టీలు సామజిక మాద్యమాలను తమ ప్రధాన ప్రచార సాధనంగా మార్చుకుంటున్నాయి.

గతంలో ఎన్నికల ప్రచారం అంటే జెండాలు, వాల్‌పోస్టర్‌లు, కటౌట్‌లు, కరపత్రాలు, ప్రచార వాహనాల జోరు కనిపించేవి. కానీ కాలం మారింది. రాజకీయ నాయకులకు ఇప్పటికీ వాటి అవసరం ఉన్నప్పటికీ వాడకం ఎంతగానో తగ్గింది. ఇందుకు ప్రధాన కారణం సోషల్‌మీడియానే. కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు వచ్చేశాయి. కూర్చున్న చోటనుంచే ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నడిపించే సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. తాము చెప్పాలనుకున్నది వేగంగా, స్పష్టంగా ఇతరులకు చేరవేయడంలో సోషల్‌మీడియా ఎంతో ప్రధానపాత్ర పోషిస్తుంది. అందుకు రాజకీయపార్టీలు ఈ సోషల్‌మీడియాపై దృష్టిసారించాయి. లోక్ సభ ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికల సమరం అయితేనేమీ, స్థానిక ఎన్నికలు గానీ ఆయా రాజకీయపార్టీలు పెట్టే ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇంటర్నెట్‌ వాడకం తెలియని లీడర్లు సైతం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసంగాలు ఇచ్చేస్తున్నారు.

సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఆకర్షించి ఓట్లు దండుకోవడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. దాని ఫలితాలు గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి. దీంతో అన్ని రాజకీయపక్షాలు క్రమంగా సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశించడం మొదలుపెట్టాయి. రాజకీయ ప్రత్యర్థులు తమ సామాజిక మాధ్యమ సైన్యాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి.

కొన్నేళ్లుగా దేశంలో ఇంటర్నెట్ వినియోగించేవారి సంఖ్య భారీగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్లు, డేటా ప్యాకేజీలు అందుబాటులోకి రావడంతో దాదాపు ప్రతి ఇంట్లో డాటా కలిగిన రెండు ఫోన్లు ఉంటున్నాయి. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాలు అందరికీ పరిచయమయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 70 కోట్ల మంది ఇంటర్నెట్ తో కూడిన ఫోన్లను వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సంఖ్య 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి దాదాపు 93 కోట్లకు చేరువవుతుందని అంచనా. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వాడే భారతీయులు ప్రస్తుతం 38 కోట్ల మందికి చేరింది. 2024 ఎన్నికల నాటికి మరో పదికోట్ల మంది సామాజిక మాధ్యమాల్లో చేరతారని అంచనా. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే, ఈ సంఖ్య గణనీయంగా ఉందని సర్వే లెక్కలే చెబుతున్నాయి.

కులాలు, మతాలు, భాషలు, పట్టణ-గ్రామీణ ప్రాంతాలు, ధనిక-పేద-మధ్యతరగతి… ఇలా విభిన్న రకాల ఓటర్లుండే భారతదేశంలో ఎన్నికలను ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయని గంపగుత్తగా లెక్కలేయడం కష్టం. ఇలాంటి భేదాలన్నింటినీ అధిగమిస్తున్నవే సామాజిక మాధ్యమాలు. ఇవి అన్ని ప్రాంతాల్లో వివిధ భావజాలాలు కలిగిన వారందరినీ ఒక్కతాటిపైకి తెస్తున్నాయి. దీన్ని అసరాగా చేసుకుని రాజకీయపార్టీలు సామాజిక మాధ్యమాల వేదిక ద్వారా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సోషల్ మీడియా ప్రధాన భూమిక పోషిస్తుదనడంలో ఏమాత్రం సందేహాం లేదు.

హైదరాబాదీ వింత ఆలోచన.. నామినేషన్ దాఖలకు ఎలా వెళ్లాడో చూడండి
హైదరాబాదీ వింత ఆలోచన.. నామినేషన్ దాఖలకు ఎలా వెళ్లాడో చూడండి
ఆ ఒక్కటి అడక్కు సినిమాకు ముందుగా అనుకున్నది అతడినే..
ఆ ఒక్కటి అడక్కు సినిమాకు ముందుగా అనుకున్నది అతడినే..
OTTలోకి వచ్చేసిన గోపీచంద్ యాక్షన్ సినిమా భీమా.!
OTTలోకి వచ్చేసిన గోపీచంద్ యాక్షన్ సినిమా భీమా.!
ఎండాకాలం కాసులు కురిపించే బిజినెస్.. పెట్టుబడి చాలా తక్కువ
ఎండాకాలం కాసులు కురిపించే బిజినెస్.. పెట్టుబడి చాలా తక్కువ
ఒక్క సినిమా రూ.120 కోట్ల రెమ్యునరేషన్ | ముద్దుల హీరోగా డార్లింగ్.
ఒక్క సినిమా రూ.120 కోట్ల రెమ్యునరేషన్ | ముద్దుల హీరోగా డార్లింగ్.
కళ్లద్దాల వల్ల ముక్కు ఇరువైపులా మచ్చలు ఏర్పడ్డాయా?
కళ్లద్దాల వల్ల ముక్కు ఇరువైపులా మచ్చలు ఏర్పడ్డాయా?
ఎప్పుడూ జరిగితే అనుభవం. ఎప్పుడో జరిగితే అద్భుతం.! పుష్ప ఎంజాయ్.
ఎప్పుడూ జరిగితే అనుభవం. ఎప్పుడో జరిగితే అద్భుతం.! పుష్ప ఎంజాయ్.
ఆ సినిమా తర్వాత సిగరెట్లకు బానిసైన హీరోయిన్..
ఆ సినిమా తర్వాత సిగరెట్లకు బానిసైన హీరోయిన్..
అదిరే లుక్స్‌, ఆకట్టుకునే ఫీచర్స్‌.. వివో నుంచి స్టన్నింగ్‌ ఫోన్‌
అదిరే లుక్స్‌, ఆకట్టుకునే ఫీచర్స్‌.. వివో నుంచి స్టన్నింగ్‌ ఫోన్‌
ఉదయాన్నే హ్యాంగోవర్‌తో ఆఫీస్‌కు వెళ్లలేకపోతున్నారా?
ఉదయాన్నే హ్యాంగోవర్‌తో ఆఫీస్‌కు వెళ్లలేకపోతున్నారా?