మార్కుల మెమో ఇవ్వలేదని.. ప్రిన్సిపల్ పై పెట్రోల్ పోసి.. ఆపై..

|

Feb 21, 2023 | 1:42 PM

విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయినిపై దాడికి తెగబడ్డాడు ఓ స్టూడెంట్. మార్కుల జాబితా ఇవ్వడం లేదన్న కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స..

మార్కుల మెమో ఇవ్వలేదని.. ప్రిన్సిపల్ పై పెట్రోల్ పోసి.. ఆపై..
Fire
Follow us on

విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయినిపై దాడికి తెగబడ్డాడు ఓ స్టూడెంట్. మార్కుల జాబితా ఇవ్వడం లేదన్న కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో ఈ ఘటన జరిగింది. ఉజ్జయిని ప్రాంతానికి చెందిన అశుతోష్‌ శ్రీవాస్తవ.. బీఎం కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ పూర్వ విద్యార్థి. గతేడాది జులైలో బి ఫార్మసీలో పాస్ అయ్యాడు. అయితే మార్కుల మెమో.. ఇవ్వలేదనే కోపంతో ప్రిన్సిపాల్‌ విముక్త శర్మపై పెట్రోల్‌ చల్లి నిప్పంటించాడు. దీంతో ఆమెకు 80శాతం గాయాలయ్యాయి. పారిపోయిన మాజీ స్టూడెంట్ ను పోలీసులు అరెస్టు చేశారు. గతంలోనూ అతను ప్రొఫెసర్‌తో గొడవపడి కత్తితో దాడి చేసినట్లు తెలిసింది. నిందితుడైన విద్యార్థి అశుతోష్ క్యాంపస్‌లో ఇబ్బంది పెట్టే వ్యక్తి అని.. గతేడాది ప్రొఫెసర్ పై దాడి చేసి, జైలుకు కూడా వెళ్లాడు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు.

కాగా.. ఈ కాలేజ్ ఇండోర్ శివార్లలో ఉంది. విముక్త శర్మ.. తరగతులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అశుతోష్ ఆమె వద్దకు వచ్చి అతని మార్క్‌షీట్‌ ఇవ్వాలని కోరాడు. దీనికి ప్రిన్సిపల్ ఒప్పుకోకపోవడంతో కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అశుతోష్ 2022లో బిఫార్మాలోని ఏడు, ఎనిమిదో సెమిస్టర్‌లలో రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..