భారత-చైనా మధ్య ఓ ‘జంక్షన్’.. అక్కడే చైనా దళాల మోహరింపు

| Edited By: Pardhasaradhi Peri

Jun 25, 2020 | 12:52 PM

భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతల సడలింపునకు ఇరు దేశాల మధ్య దౌత్య స్థాయిలో చర్చలు జరిగాయని, బోర్డర్లో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలని అంగీకారానికి వచ్చారని వార్తలు వచ్చినప్పటికీ లడాఖ్ లోని గాల్వన్ లోయలో..

భారత-చైనా మధ్య ఓ జంక్షన్.. అక్కడే చైనా దళాల మోహరింపు
Follow us on

భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతల సడలింపునకు ఇరు దేశాల మధ్య దౌత్య స్థాయిలో చర్చలు జరిగాయని, బోర్డర్లో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలని అంగీకారానికి వచ్చారని వార్తలు వచ్చినప్పటికీ లడాఖ్ లోని గాల్వన్ లోయలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుధ్ధంగా ఉంది. అక్కడి ‘షయొక్’, గాల్వన్ నదుల మధ్య ‘వై-జంక్షన్’ సమీపంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలు గన్ పొజిషన్స్ తో బాటు భారీ ఎత్తున శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగానికి అతి సమీపంలోనే ఉంది. దీంతో డెప్సాంగ్, దౌలత్ బేగ్ ఓల్డీ, గాల్వన్, హాట్ స్ప్రింగ్స్, పాంగంగ్ సో, ఛుషుల్, చుమార్ సెక్టార్లలో భారత దళాలు అదనపు బలగాలను, ఆర్టిల్లరీ గన్స్ ను మోహరించాయి. ఆర్మీ ఛీప్జ్ జనరల్ ఎం.ఎం. నరవాణే.. ఈస్టర్న్ లడాఖ్ ప్రాంతాలను సందర్శించారు. పెట్రోలింగ్ పాయింట్-14 (పీపీ-14) వద్ద చైనా సైనికులు భారీ సంఖ్యలో చేరుకున్నట్టు శాటిలైట్ ఇమేజీలు కూడా చూపుతున్నాయి. ఈ నెల 15 న ఇక్కడే ఉభయ దేశాల దళాల మధ్య పెను ఘర్షణ జరిగింది. పరిస్థితి తీవ్రంగా ఉందని, కానీ జూన్ 15 తరువాత ఘర్షణ లేవీ జరగలేదని సీనియర్ సైనికాధికారి ఒకరు  తెలిపారు. డెప్సంగ్ ప్రాంతంలో 2013 ఏప్రిల్-మే నెలల్లో సుమారు ఇరవై రోజులకు పైగా భారత-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగి యుధ్ధ వాతావరణం ఏర్పడింది.