వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తులతో ఆలయాలు నిండిపోయాయి. తమిళనాడులో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైష్ణవ ఆలయాలు, తిరుచ్చి శ్రీరంగం తో పాటు చెన్నై లోని పార్థసారతి ఆలయం లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు కొనసాగుతున్నాయి.
కరోనా నిబంధనల నేపధ్యం లో ప్రతి రోజు మూడువేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంది. ఉత్తరద్వారం ద్వారా భక్తులకు శ్రీ రంగం రంగనాథస్వామి దర్శనమిస్తున్నారు. అన్ని ప్రముఖ ఆలయాలలో భక్తులు కరోనా నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.
తెలుగు రాష్ట్రాల్లో కన్నుల పండువగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు..