ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం.. లిఫ్ట్‌లో చిక్కుకుని ఏడుగురు సజీవదహనం..

తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. దిండిగల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు సజీవదహనమయ్యారు.. మృతుల్లో మూడేళ్ల చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది.. దాదాపు 20మందికి గాయాలైనట్లు పేర్కొంటున్నారు.

ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం.. లిఫ్ట్‌లో చిక్కుకుని ఏడుగురు సజీవదహనం..
Fire Accident

Updated on: Dec 13, 2024 | 7:24 AM

తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. దిండిగల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు సజీవదహనమయ్యారు.. మృతుల్లో మూడేళ్ల చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది.. దాదాపు 20మందికి గాయాలైనట్లు పేర్కొంటున్నారు. దిండిగల్-తిరుచ్చి హైవే సమీపంలోని గాంధీ నగర్ ప్రాంతంలోని ఆసుపత్రిలో గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. ఆసుపత్రిలోని 32 మందిని ఫైర్‌ సిబ్బంది కాపాడారు.. ఆస్పత్రిలో మంటలను ఆర్పేందుకు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేశారు.. ఈ ప్రమాదంలో ఆరుగురు ఆసుపత్రిలోని లిఫ్ట్‌లో చిక్కుకుపోయారని.. వారు ఊపిరాడక, కాలిపోయి మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో 3 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడని చెబుతున్నారు..

ప్రభుత్వ, ప్రయివేటు అంబులెన్స్‌లతో సహా 50కి పైగా అంబులెన్స్‌లను పిలిపించి ఆసుపత్రిలో చేరిన రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు..ప్రైవేట్ బోన్ ఆస్పత్రిలో మంటలు చెలరేగినట్లు తెలియడంతో దిండిగల్ జిల్లా కలెక్టర్ బూంగోడి, ఆర్టీఓ శక్తివేల్, డిప్యూటీ మేయర్ రాజప్ప తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

చాలామంది రోగులను రక్షించి సమీపంలోని ప్రభుత్వ – ప్రైవేట్ ఆసుపత్రులలో చేర్చామని.. కొంత మంది ప్రాణనష్టం సంభవించవచ్చని కలెక్టర్ తెలిపారు.. అయితే వైద్యులు నిర్ధారించిన తర్వాతే మరణాల సంఖ్యను నిర్ధారిస్తామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us