Tamil Nadu: అతను చదివేది బీటెక్.. దోచుకుంది మాత్రం 100 కోట్లు.. అదెలాగో తెలిస్తే మైండ్ బ్లాంకే..

|

Aug 05, 2022 | 9:42 PM

Online Cheating: నిరుద్యోగులే వారి టార్గెట్.. ఉద్యోగాల పేరుతో నమ్మిస్తారు. ఆన్‌లైన్ ఉద్యోగమంటూ నోటిఫికేషన్ ఇస్తారు. అభ్యర్థుల నుంచి అప్లికేషన్ ఫీజ్ వసూలు చేస్తారు.

Tamil Nadu: అతను చదివేది బీటెక్.. దోచుకుంది మాత్రం 100 కోట్లు.. అదెలాగో తెలిస్తే మైండ్ బ్లాంకే..
Money
Follow us on

Online Cheating: నిరుద్యోగులే వారి టార్గెట్.. ఉద్యోగాల పేరుతో నమ్మిస్తారు. ఆన్‌లైన్ ఉద్యోగమంటూ నోటిఫికేషన్ ఇస్తారు. అభ్యర్థుల నుంచి అప్లికేషన్ ఫీజ్ వసూలు చేస్తారు. ఆపై జెండా ఎత్తేస్తారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 100 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. అలాగని వీరేదో కరుడుగట్టి నేరస్తులూ కాదు.. కేవలం ఇంజనీరింగ్ స్టూడెంట్స్. తమ టాలెంట్‌ను స్టడీపై కాకుండా.. ఇలాంటి క్రిమనల్ వర్క్స్ మీద పెట్టి అమాయకులను దోచేసుకున్నారు. అయితే, వంద ఏనుగులను తిన్న రాబందు అయినా ఒక్క గాలివానకు కూలిపోయినట్లు.. వీరు కూడా అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు జైలు గోడల మధ్య ఊచలు లెక్కిస్తూ కూర్చున్నారు. ఈ ఘరానా మోసం తమిళనాడులో వెలుగు చూసింది.

ఇంజనీరింగ్ కేటుగాళ్ల చీటింగ్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ లీడర్‌గా ఓ గ్యాంగ్ మాస్టర్ ప్లాన్ వేసింది. ఈజీగా మనీ సంపాదించాలనే దురుద్ధేశంతో పథకం వేశారు. అలా ఆలోచించడమే ఆలస్యం.. ప్లాన్‌ను అమలు చేశారు. ముంబై కంపెనీ పేరుతో ఉద్యోగాలిప్పిస్తామని ఆన్‌లైన్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనను నమ్మిన నిరుద్యోగులు చాలా మంది కొంతమొత్తం డబ్బు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. అలా కోట్లలో డబ్బులు వసూలైంది. అనంతరం ఆ చీటర్స్ ఉడాయించారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు.. దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు.

కన్యాకుమారి జిల్లాలోని నాగర్కోవిల్‌లో ఆన్‌లైన్ చీటింగ్‌కు పాల్పడిన ప్రిన్స్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్‌లో ఇతనే కీలక వ్యక్తిగా గుర్తించారు అధికారులు. కోట్లలో నగదు తీసుకుని చీటింగ్ చేసినట్లు గుర్తించారు. ఈ గ్యాంగ్‌లో మిగతావారు పరారీలో ఉన్నారని, వారికోసం గాలింపు ముమ్మరం చేసినట్లు తెలిపారు సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే, ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంతటి మోసానికి పాల్పడటం చూసి అధికారులే అవాక్కయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..