SingleVoteBJP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ‘‘ఒక్క ఓటు’’.. నెట్టింట్లో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు..

|

Oct 13, 2021 | 8:26 AM

SingleVoteBJP: తమిళనాడులో ఓ బీజేపీ అభ్యర్థి పరువు తీశారు ఓటర్లు. ఆఖరికి అతని కుటుంబ సభ్యులు కూడా ఆయన గాలి తీసేశారు. తాజాగా కోయంబత్తూర్‌లో జరిగిన స్థానిక సంస్థల

SingleVoteBJP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ‘‘ఒక్క ఓటు’’.. నెట్టింట్లో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు..
Vote
Follow us on

SingleVoteBJP: తమిళనాడులో ఓ బీజేపీ అభ్యర్థి పరువు తీశారు ఓటర్లు. ఆఖరికి అతని కుటుంబ సభ్యులు కూడా ఆయన గాలి తీసేశారు. తాజాగా కోయంబత్తూర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఓ అభ్యర్థికి కేవలం ఒక్కటంటే ఒక్కటే ఓటు పోలైంది. అది కూడా అతనిదే కావడం గమనార్హం. సదరు అభ్యర్థి ఇంట్లో ఐదుగురు ఓటర్లు ఉంటే.. కేవలం ఒక్క ఓటు మాత్రమే పోలవడం విశేషం. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా మొత్తం ఈ ‘ఒక్క ఓటు’ వ్యవహారం రచ్చ రచ్చ చేస్తోంది. అయితే, తన కుటుంబ సభ్యులు ఓట్లు అవతలి వార్డులో ఉన్నందు వల్ల వారు తనకు ఓటు వేటు వేయలేకపోయారని బీజేపీ అభ్యర్థి కార్తిక్ చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ.. రాజకీయ ప్రత్యర్థులు, నెటిజన్లు మాత్రం వదలడం లేదు. #SingleVoteBJP అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌ సహా ఇతర సోషల్ మీడియా ప్లా్ట్‌ఫామ్‌లలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

రచయిత్రి, సామాజిక కార్యకర్త అయిన మీనా కందసామి కూడా ఈ ‘ఒక్క ఓటు’ అంశంపై స్పందించారు. ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్క ఓటు మాత్రమే నమోదైంది. అయితే, అతని ఇంట్లోనే ఉన్న మిగిలిన నలుగురు ఓటర్లు ఇతరులకు ఓటు వేయాలని నిర్ణయించుకోవడం గర్వంగా ఉంది.’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇక డీఎంకే ఐటీ వింగ్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ ఇసాయి మరో రేంజ్‌లో సెటైర్లు పేల్చారు. ‘ఒక్క ఓటు పొందినందుకు శుభాకాంక్షలు’ అంటూ సెటైర్లు వేశారు. “తమిళనాడు ప్రజలు మరీ క్రూరంగా ఉన్నారు. కనీసం 10 ఓట్లు అయినా వేయొద్దా!’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు మరో ట్విట్టర్ యూజర్.

అక్టోబర్ 9వ తేదీన కోయంబత్తూరులో స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగాయి. జిల్లా పంచాయితీ వార్డ్ మెంబర్, గ్రామ పంజాయితీ వార్డ్ మెంబర్, గ్రామ మున్సిపల్ చైర్మన్ సహా 13 పోస్టులకు ఎన్నికలు జరిగాయి. అయితే, కోయంబత్తూరు జిల్లా బీజేపీ యువజన విభాగం డిప్యూటీ సెక్రటరీ అయిన డి. కార్తీక్.. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేశారు. మంగళవారం నాడు కౌంటింగ్ నిర్వహించగా.. కార్తిక్‌కు ఒక్క ఓటు మాత్రమే నమోదైంది. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. అయితే, రాజకీయ ప్రత్యర్థులు దీన్ని క్యాష్ చేసుకున్నారు. బీజేపీకి ‘ఒక్క ఓటు’ పడిందంటూ ఎద్దేవా చేయడం ప్రారంభించారు. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తులపై అభ్యర్థులు పోటీ చేయడానికి వీలు లేదు. కానీ, అభ్యర్థులకు రాజకీయ పార్టీల మద్దతు మాత్రమే ఉంటుంది.

Also read:

Coal and Power Crisis: బొగ్గు, విద్యుత్ సంక్షోభం మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాబోయే 5 రోజుల్లో బొగ్గు ఉత్పత్తి పెరుగుతుంది..

Poonam Kaur-PK Love: సోషల్ మీడియాలో రచ్చ అవుతున్న ‘పూనమ్ కౌర్’ ట్వీట్.. #PK love అంటూ..

Fact Check: వాట్సాప్‌ రాత్రి 11.30 నుంచి ఉదయం 6 గంటల వరకు నిలిచిపోనుందా..? ఇందులో నిజమెంత..?