ప్రధాని మోదీకి గుడి.. అంతేకాదు.. ఇంకా అందులో…

ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న అభిమానంతో.. ఓ రైతు ఎవరూ ఊహించని పనిచేశాడు. ఏకంగా ప్రధాని మోదీకి గుడికట్టేశాడు. అది కూడా ఆ రైతు సొంత పొలంలోనే. తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఎరకుడిలో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఒకటైన.. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్ నిధి పథకాలతో శంకర్‌ అనే రైతు మోదీ పట్ల అభిమానం పెంచుకున్నాడు. ఈ అభిమానంతో తన పొలంలోనే మోదీకి గుడి నిర్మించాడు. అంతేకాదు ఆ గుడిలో నిత్యం పూజలు […]

ప్రధాని మోదీకి గుడి.. అంతేకాదు.. ఇంకా అందులో...

Updated on: Dec 26, 2019 | 9:17 AM

ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న అభిమానంతో.. ఓ రైతు ఎవరూ ఊహించని పనిచేశాడు. ఏకంగా ప్రధాని మోదీకి గుడికట్టేశాడు. అది కూడా ఆ రైతు సొంత పొలంలోనే. తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఎరకుడిలో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఒకటైన.. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్ నిధి పథకాలతో శంకర్‌ అనే రైతు మోదీ పట్ల అభిమానం పెంచుకున్నాడు. ఈ అభిమానంతో తన పొలంలోనే మోదీకి గుడి నిర్మించాడు. అంతేకాదు ఆ గుడిలో నిత్యం పూజలు కూడా చేస్తున్నాడు. ఈ మోదీ గుడి నిర్మాణానికి మొత్తం ఒకటిన్నర లక్షల వరకు ఖర్చు అయ్యిందని శంకర్ తెలిపారు. ఎనిమిది నెలల క్రితం ఈ గుడి నిర్మాణం ప్రారంభించామని.. గత వారం క్రితమే ప్రారంభించినట్లు పేర్కొన్నాడు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందానని.. అంతేకాకుండా ఆయన వ్యక్తిత్వం తనను ఎంతో ఆకర్షించిందన్నారు.

కాగా, ఈ గుడిలో కేవలం ప్రధాని మోదీ విగ్రహమే కాదు.. ఇంకా ఇతర రాజకీయ నాయకులు చిత్రపటాలు కూడా ఉన్నాయి. దివంగత మాజీ సీఎం జయలలిత, తమిళనాడు సీఎం పళనిస్వామి, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా,, కాంగ్రెస్‌ నేత కే కామరాజ్‌ చిత్ర పటాలను కూడా ఏర్పాటు చేశాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us