Swami Prasad Maurya: రాష్ట్రంలో విషపూరితమైన రాజకీయాలు.. మాజీ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య సంచలన వ్యాఖ్యలు

Swami Prasad Maurya: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఫాజిల్‌నగర్ స్థానం నుంచి ఓటమి పాలైనందుకు తీవ్ర మనస్తాపానికి గురైన ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి..

Swami Prasad Maurya: రాష్ట్రంలో విషపూరితమైన రాజకీయాలు.. మాజీ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య సంచలన వ్యాఖ్యలు
Follow us

|

Updated on: Mar 12, 2022 | 5:33 PM

Swami Prasad Maurya: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఫాజిల్‌నగర్ స్థానం నుంచి ఓటమి పాలైనందుకు తీవ్ర మనస్తాపానికి గురైన ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య శనివారం స్పందించారు. బీజేపీ (BJP)ని వీడి స‌మాజ్‌వాదీలో చేరిన ఆయన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మొద‌టి సారిగా స్పందించారు. గెలిచిన వారంద‌రికీ ఆయ‌న ట్విట్టర్ వేదిక‌గా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేవి సహజమని మీడియాతో వ్యాఖ్యానించారు. ఓటమిని తాను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రనా ఆత్మస్థైర్యం కోల్పోనని మౌర్య స్పష్టం చేశారు. ఏ విష‌యాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీని వీడానో.. ఇప్పటికీ ఆ స‌మ‌స్యలున్నాయ‌ని అన్నారు. వాటిపైనే తన పోరాటం సాగిస్తానని అన్నారు. ప్రజలు రాజ‌కీయాన్ని అర్థం చేసుకున్న చోట్ల తీర్పు స‌రిగ్గానే వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో విషపూరితమైన రాజకీయాలు కొనసాగుతున్నాయని బీజేపీ (BJP), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (BSP)లను ఉద్దేశించి మౌర్య వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో జరిగే అంశాలను పాము, ముగింసవలె పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. అయితేపాముతో జరిగే పోరాటంలో ముంగిస ఎప్పుడూ గెలుస్తుందని పేర్కొన్న మౌర్య.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తానే ముంగిస అని, తన ప్రత్యర్థులు పాములేనని వ్యాఖ్యానించారు. అయితే మాజీ బీజేపీ నాయకుడు మౌర్య ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆయన గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. అంతకుముందు 2016లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మౌర్య.. 2017 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో 403 మంది సభ్యులున్న అసెంబ్లీలో 255 సీట్లు గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ 111 సీట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. అయితే బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడంతో మౌర్య విరుచుకుపడ్డారు. ఇప్పుడు రెండు పార్టీలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి:

Priyanka Gandhi: ప్రజల నమ్మకాన్ని పొందడంలో ప్రియాంక విఫలమయ్యారా.. యూపీలో ఆమె వైఫల్యానికి కారణాలేమిటి..

AIMIM: యూపీ ఎన్నికల్లో ఎంఐఎం ఎవరి కొంప ముంచింది? ఎవరికి మేలు చేసింది?

Latest Articles
పూరన్ పోరాటం వృథా.. పోరాడి ఓడిన లక్నో.. ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
పూరన్ పోరాటం వృథా.. పోరాడి ఓడిన లక్నో.. ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?
ఆసీస్ బీచుల్లో రష్మిక ఫొటో షూట్.. చూడ్డానికి రెండు కళ్లు చాలవంతే!
ఆసీస్ బీచుల్లో రష్మిక ఫొటో షూట్.. చూడ్డానికి రెండు కళ్లు చాలవంతే!
రసాయనాలు లేకుండా రెండ్రోజుల్లోనే పచ్చి అరటిగెల పండింది..?!ఎలాగంటే
రసాయనాలు లేకుండా రెండ్రోజుల్లోనే పచ్చి అరటిగెల పండింది..?!ఎలాగంటే
బాలీవుడ్‏లోకి తెలుగమ్మాయి.. ఊహించని పాత్రలో అనన్య..
బాలీవుడ్‏లోకి తెలుగమ్మాయి.. ఊహించని పాత్రలో అనన్య..
ఒక నెల రోజుల పాటు అన్నం తినకపోతే ఏమవుతుందో తెలుసా..?
ఒక నెల రోజుల పాటు అన్నం తినకపోతే ఏమవుతుందో తెలుసా..?
అదరగొట్టిన అభిషేక్.. ఆఖరులో స్టబ్స్ మెరుపులు.. ఢిల్లీ భారీ స్కోరు
అదరగొట్టిన అభిషేక్.. ఆఖరులో స్టబ్స్ మెరుపులు.. ఢిల్లీ భారీ స్కోరు
ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ ముట్టని హీరోయిన్..
ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ ముట్టని హీరోయిన్..
లక్నో ఓనర్ ఇంట్లో కేఎల్ రాహుల్‌ డిన్నర్.. అతియా శెట్టి ఏమందంటే?
లక్నో ఓనర్ ఇంట్లో కేఎల్ రాహుల్‌ డిన్నర్.. అతియా శెట్టి ఏమందంటే?
రాత్రి మిగిలిన చపాతీ పడేస్తున్నారా..?లాభాలు తెలిస్తేఆశ్చర్యపోతారు
రాత్రి మిగిలిన చపాతీ పడేస్తున్నారా..?లాభాలు తెలిస్తేఆశ్చర్యపోతారు