కాలేజ్‌లో డ్యాన్స్‌ ఇరగదీసిన మమితా

Phani.ch

14 May 2024

కేవలం ఒకే ఒక్క సినిమాతో దక్షిణాదిలో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది మమితా బైజు. అంతకు ముందు మలయాళంలో అనేక చిత్రాల్లో నటించింది.

కానీ ఇటీవల ఒక్క సినిమాతోనే ఇటు టాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టిలో పడిపోయింది. అంతేకాదు.. తెలుగు కుర్రాళ్ల ఆరాధ్య దేవిగా మారిపోయింది.

ఇంతకీ ఆ సినిమా ఏంటీ అనుకుంటున్నారా ?.. అదే ప్రేమలు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీని దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తీకేయ తెలుగుకి తీసుకువచ్చారు.

రిలీజ్ అయిన మొదటి రోజే భారీ హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్ కలెక్షన్స్ రాబట్టింది.

ఇక ఇందులో కథానాయికగా నటించిన మమితా బైజుకు వచ్చిన ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ కుర్రాళ్లు ఈ బ్యూటీకి హారతి ఇచ్చి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

అలాగే సోషల్ మీడియాలో ఈ బ్యూటికి సంబంధించిన ప్రతి పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా మమితాకు సంబంధించి చైల్డ్ హుడ్ ఫోటోస్, త్రోబ్యాక్ పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. 

ఇదివరకే కాలేజీలో మమితా చేసిన డాన్స్ వీడియోస్ తెగ వైరలైన సంగతి తెలిసిందే. తాజాగా మరో వీడియోను ఆమె ఫ్యాన్ పేజేస్ ట్రెండ్ చేస్తున్నారు.