టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలీష్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్. యాక్టింగ్.. డ్రెస్సింగ్.. డాన్స్.. మ్యానరిజం ఇలా ప్రతి విషయంలో బన్నీ స్టైల్ వేరే.
గంగోత్రి సినిమాతో హీరోగా మొదలైన సినీ ప్రయాణం ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా కొనసాగుతోంది. పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
ఇక ఈ క్రమంలోనే ఆర్య మూవీ 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లో ఆర్య 20 ఇయర్స్ సెలబ్రెషన్స్ జరిగింది.
ఈవేడుకకు ఆర్య చిత్రయూనిట్, సినీ ప్రముఖులు, నిర్మాతలు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో బన్నీ మరింత స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు.
బ్లాక్ షర్ట్, జీన్స్ ధరించి స్టైలీష్ లుక్‌లో కనిపించాడు. ఇక అదే సమయంలో బన్నీ ధరించిన ప్రాడా షూస్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించాయి.
దీంతో ఆ షూస్ ధర తెలుసుకోవడానికి నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు బన్నీ షూస్ ధర గురించి సెలబ్రెటీస్ అవుట్ ఫిట్ డీకోడ్ అనే ఇన్ స్టా పేజీ వెల్లడించింది.
ఆ ఇన్ స్టా పేజీ ప్రకారం బన్నీ ధరించిన ప్రాడా షూస్ ధర 86,020 ఉంటుందట. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.