మహేశ్ బాబుకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా?
TV9 Telugu
14 May 2024
సంక్రాంతికి రిలీజైన గుంటూరుకారం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.
ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో ఇండియానా జోన్స్ తరహాలో ఓ అడ్వెంచెరస్ థ్రిల్లర్ మూవీని ప్లాన్ చేస్తున్నారు మహేశ్ బాబు.
ప్రస్తుతం ఈ మూవీ కోసం లొకేషన్స్, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే మహేశ్ కూడా ఈ మూవీ కోసం జిమ్ లో తెగ కష్టపడుతున్నాడు.
భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధికంగా రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్ తో మహేశ్- రాజమౌళి సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, షూటింగ్స్, లొకేషన్స్ తదితర వివరాలు బయటకు రానున్నాయి.
కాగా భారతీయ సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో మహేశ్ బాబు కూడా ఒకరు. 40 ఏళ్లు దాటినా ఎంతో యంగ్ గా కనిపిస్తుంటారాయన.
మరి ఈ వయసులో మహేశ్ ఇంత అందంగా, యంగ్ గా కనిపించాలంటో ఆహారంలో కూడా ఎన్నో మార్పులుంటాయి.
అయితే మహేశ్ బాబుకు బిర్యానీ అంటే చాలా ఇష్టమట. అలాగే గోంగూర మటన్ ను కూడా బాగా లాగించేస్తారని నటుడు నరేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఇక్కడ క్లిక్ చేయండి,,