14 May 2024
TV9 Telugu
Pic credit - Pexels
మంచి ఎదుగుదలకు కాల్షియం చాలా ముఖ్యం. అయితే కొంతమందికి పాలు తాగడం అస్సలు ఇష్టం ఉండదు. దీని వల్ల వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనమవుతాయి.
చాలా మంది ప్రజలు పాలు తాగడానికి ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో వీరు తినే ఆహరంలో కొన్ని రకాల పదార్ధాలను చేర్చుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని తీర్చవచ్చు.
ఓట్స్‌లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, విటమిన్ బి లోపాన్ని అర కప్పు ఓట్స్‌తో తీర్చుకోవచ్చు. ఓట్స్ చేసిన ఆహారాన్ని పిల్లలకు అందించవచ్చు.
బాదంపప్పు కాల్షియం అద్భుతమైన మూలంగా పరిగణించబడుతుంది. రోజూ ఉదయం నానబెట్టిన బాదంపప్పును పిల్లలకు తినిపించవచ్చు. లేదా వారానికి ఒకసారి బాదం హల్వాను కూడా ఇవ్వవచ్చు.
100 గ్రాముల రాగులలో 340 mg కాల్షియం లభిస్తుంది. ఎదిగే పిల్లలకు అల్పాహారంగా రాగి బాల్స్, రాగి కేక్ లేదా రాగి లడ్డూ ఇవ్వవచ్చు.
పాల పదార్ధాలైన పెరుగు, లస్సీలో కూడా చాలా కాల్షియం లభిస్తుంది. పిల్లలు పాలు తాగకపోతే.. పెరుగు లేదా లస్సీని తాగడానికి అందించండి.
కాల్షియం లోపాన్ని భర్తీ చేయడానికి సోయా మిల్క్ ఉత్తమంగా పరిగణించబడుతుంది. పాలు తాగడానికి ఇష్టపడని వారు తినే ఆహారంలో సోయా పాలను చేర్చుకోండి. క్యాల్షియంతోపాటు ఐరన్, పీచు కూడా లభిస్తాయి.