SUV swept away in flood water in Nagpur: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. వాహనానికి అన్ని వైపులా నీరు చుట్టుముట్టడంతో ముగ్గురు జలసమాధి అయ్యారు. నీటిలో కొట్టుకుపోతున్న వాహనంలో నుంచి బాధితులు.. రక్షించాలంటూ కేకలు వేశారు. వారిని కాపాడే ప్రయత్నం చేస్తుండగానే కారు నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాన్ని అక్కడున్న కొందరు ఫోన్లలో చిత్రీకరించగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. నాగ్‌పూర్‌లోని సావ్నర్ తహసీల్ కేల్వాద్ దగ్గర నందా నదిపై ఉన్న వంతెనను దాటుతుండగా కారు కొట్టుకుపోయిందని.. ఈ ఘటనలో మహిళతోపాటు ముగ్గురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్ ముల్తాయికి చెందిన ఓ కుటుంబం.. వివాహ వేడుక కోసం నాగ్‌పూర్‌కు వచ్చింది. తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా రేయిలింగ్ లేని బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహిస్తోంది. వాహనం వెళ్తుండగా.. వరదనీరు ముంచెత్తడంతో ప్రవాహంలో కొట్టుకుపోయింది.
వీడియో చూడండి..
#Maharashtra 3 died and about 3 trapped after a scorpio car washed away in Nanda river of Kelwad, Tahsil Saoner, District #Nagpur amid heavy flow of water induced by rains, confirms @SPNagpurrural@CMOMaharashtra@Dev_Fadnavis@Devendra_Office #MaharashtraRains pic.twitter.com/TvcaoMAYeR
— Praveen Mudholkar (@JournoMudholkar) July 12, 2022
ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణికులున్నారు. ఇద్దరు ప్రయాణికులు ఈదుకుంటూ సురక్షితంగా బయటపడగా.. ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని.. మరో ముగ్గురు గల్లంతైనట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను రోష్ని చౌకీదార్ (32), దర్శ్ చౌకీదార్ (10), ఎస్‌యూవీ డ్రైవర్ లీలాధర్ హివారే (38)గా గుర్తించారు. గల్లంతైన వారిలో మధుకర్ పాటిల్ (65), అతని భార్య నిర్మల (60), నీము అట్నర్ (45) ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి