సుశాంత్ కేసులో ఇక రియా డ్రగ్ డీలర్ గౌరవ్ ఆర్య విచారణ

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్  రియా చక్రవర్తికి, డ్రగ్ డీలర్, గోవాలో హోటల్ యజమాని కూడా అయినా గౌరవ్ ఆర్యని ఈడీ సోమవారం విచారించనుంది. ఈ కేసులో మనీ లాండరింగ్..

సుశాంత్ కేసులో ఇక రియా డ్రగ్ డీలర్ గౌరవ్ ఆర్య విచారణ

Edited By:

Updated on: Aug 30, 2020 | 2:14 PM

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్  రియా చక్రవర్తికి, డ్రగ్ డీలర్, గోవాలో హోటల్ యజమాని కూడా అయినా గౌరవ్ ఆర్యని ఈడీ సోమవారం విచారించనుంది. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలోనూ ఈ దర్యాప్తు సంస్థ ఇన్వెస్టిగేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గౌరవ్ ఆర్యను శనివారం నాడే విచారించవలసి ఉండగా.. ఆయన ఈ రోజు ముంబై చేరుకోనున్నాడు. ఈ కేసులో రియాకు, గౌరవ్ ఆర్యకు మధ్య నడిచిన డ్రగ్ దందా తాలూకు ఫోన్ చాటింగ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ లో బయట పడింది. దాంతో ఈ సంస్థ కూడా ఆమెను, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని, రియా టాలెంట్ మేనేజర్ జయా సాహాను కూడా విచారిస్తోంది.

మరోవైపు రియాను సీబీఐ వరుసగా మూడో  రోజైన ఆదివారం కూడా విచారించింది. నిన్న సుమారు తొమ్మిది గంటలపాటు ఆమెను ఇంటరాగేట్ చేశారు.   ప్రస్తుతం రియా మూడు దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటోంది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us