సురేష్ రైనా బంధువు హత్యపై దర్యాప్తునకు ‘సిట్’ ఏర్పాటు

| Edited By: Pardhasaradhi Peri

Sep 01, 2020 | 7:59 PM

క్రికెటర్ సురేష్ రైనా బంధువు అశోక్ కుమార్ దారుణ హత్యపై దర్యాప్తు కోసంపంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ఆదేశాలమేరకు 'సిట్' బృందాన్ని ఏర్పాటు చేశారు. గత నెల 20 న పఠాన్ కోట్ లో దోపిడీ దొంగలు..

సురేష్ రైనా  బంధువు హత్యపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు
Follow us on

క్రికెటర్ సురేష్ రైనా బంధువు అశోక్ కుమార్ దారుణ హత్యపై దర్యాప్తు కోసంపంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ఆదేశాలమేరకు ‘సిట్’ బృందాన్ని ఏర్పాటు చేశారు. గత నెల 20 న పఠాన్ కోట్ లో దోపిడీ దొంగలు అశోక్ కుమార్ కుటుంబంపై  దాడి చేశారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన  అశోక్ కుమార్ కొడుకు కౌశల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించారు. అటు ఈ కుటుంబ సభ్యుల్లో  మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటనపై సురేష్ రైనా..దుండగులను వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సీఎం అమరేందర్ సింగ్.. వెంటనే సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మీ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.