Supreme Court: ధర్మసంసద్‌ సమావేశానికి అనుమతి ఇవ్వొద్దు.. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

|

Apr 26, 2022 | 2:08 PM

ఉత్తరాఖండ్‌ , హిమాచల్‌ రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరాఖండ్‌లో రేపు జరిగే ధర్మ సంసద్‌కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వరాదని సుప్రీంకోర్టు..

Supreme Court: ధర్మసంసద్‌ సమావేశానికి అనుమతి ఇవ్వొద్దు.. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Follow us on

ఉత్తరాఖండ్‌( Uttarakhand) , హిమాచల్‌ రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరాఖండ్‌లో రేపు జరిగే ధర్మ సంసద్‌కు(Dharma Sansad) ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్వేషపూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేయడంలో ఎందుకు వెనుకాడుతున్నారని సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గత ఏడాది ఉత్తరాఖండ్‌ లోని హరిద్వార్‌లో ధర్మసంసద్‌ పేరుతో విద్వేష పూరిత ప్రసంగాలు చేసినట్టు సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ముస్లింలను ఊచకోత కోయాలని కొందరు ఈ సమావేశంలో పిలుపునిచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిగిన సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరాఖండ్‌లో ధర్మసంసద్‌కు అనుమతి ఇవ్వవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌ 16,17 తేదీల్లో హిమాచల్‌ లోని ఉనాలో జరిగిన ధర్మసంసద్‌పై అఫిడవిట్‌ సమర్పించాలని సుప్రీంకోర్టు హిమాచల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో బుధవారం జరగనున్న ధర్మసంసద్‌పై సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ద్వేషపూరిత ప్రసంగాలను ఆపకపోతే ప్రధాన కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాన కార్యదర్శిని కోర్టుకు పిలిపిస్తాం. ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించండి. ద్వేషపూరిత ప్రసంగాలను ఆపడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలిని ఆదేశించింది.

వారి ప్రసంగాలను రికార్డులో ఉంచుకోవాలని, అవసరమైతే అధికారులు తీసుకున్న దిద్దుబాటు చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ప్రభుత్వం హామీ ఇస్తున్నా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్  ఆదేశించారు. విచారణ సందర్భంగా రూర్కీలో బుధవారం జరగనున్న సదస్సుపై స్టే విధించాలని సిబల్‌ డిమాండ్‌ చేశారు. 

ఇవి కూడా చదవండి: Elon Musk Buy Twitter: ఎలన్‌ మస్క్‌ చేతిలోకి ట్విట్టర్‌ పిట్ట.. 44 బిలియన్‌ డాలర్లకు డీల్‌..

Teething in Babies: మీ పిల్లలకి పళ్ళు వస్తున్నాయా.. అప్పుడు మీరు చేయాల్సిన పనులు ఇవే..