బ్రేకింగ్ : మహా ఉత్కంఠలో మళ్లీ సస్పెన్స్..

| Edited By:

Nov 25, 2019 | 12:35 PM

మహా ఉత్కంఠలో మళ్లీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఇరు పక్షాల వాదానలు విన్న సుప్రీం కోర్టు.. తన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పును ప్రకటించనుంది. తొలుత 24 గంటల్లోగా అసెంబ్లీలో బలపరీక్షను నిరూపించుకోవాల్సిందిగా బీజేపీని ఆదేశించిన కోర్టు.. ఆ తర్వాత తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు కేంద్రం తరఫున వాదించిన  సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. రెండు లేఖలను సుప్రీంకోర్టుకు అందజేశారు. ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టులో.. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ […]

బ్రేకింగ్ : మహా ఉత్కంఠలో మళ్లీ సస్పెన్స్..
Follow us on

మహా ఉత్కంఠలో మళ్లీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఇరు పక్షాల వాదానలు విన్న సుప్రీం కోర్టు.. తన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పును ప్రకటించనుంది. తొలుత 24 గంటల్లోగా అసెంబ్లీలో బలపరీక్షను నిరూపించుకోవాల్సిందిగా బీజేపీని ఆదేశించిన కోర్టు.. ఆ తర్వాత తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు కేంద్రం తరఫున వాదించిన  సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. రెండు లేఖలను సుప్రీంకోర్టుకు అందజేశారు.

ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టులో.. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ.. దాఖలైన రిట్ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతుండగానే.. మరోవైపు సీఎంగా ఫడ్నవీస్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు సీఎం ఫడ్నవీస్ వెంట డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో కమలదళం ఎంతో ధీమాగా ఉందన్నది స్పష్టమవుతోంది.