Supreme Court: విడాకులిచ్చిన భర్తకు సుప్రీం షాక్.. రూ.2.60 కోట్ల భరణం చెల్లించాలని ఆదేశాలు.. లేకపోతే..

|

Mar 29, 2021 | 12:06 AM

Divorce Case: భార్యకు బకాయిలతోపాటు భరణం చెల్లించకుండా.. కోర్టు ధిక్కరణకు పాల్పడిన వ్యక్తికి సర్వోన్నత న్యాయస్థానం మూడు నెలల జైలు శిక్ష విధించింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి విడాకులు తీసుకున్న తన భార్యకు 2.60 కోట్ల రూపాయలు,

Supreme Court: విడాకులిచ్చిన భర్తకు సుప్రీం షాక్.. రూ.2.60 కోట్ల భరణం చెల్లించాలని ఆదేశాలు.. లేకపోతే..
Supreme-Court
Follow us on

Divorce Case: భార్యకు బకాయిలతోపాటు భరణం చెల్లించకుండా.. కోర్టు ధిక్కరణకు పాల్పడిన వ్యక్తికి సర్వోన్నత న్యాయస్థానం మూడు నెలల జైలు శిక్ష విధించింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి విడాకులు తీసుకున్న తన భార్యకు 2.60 కోట్ల రూపాయలు, నెలవారీగా చెల్లించాల్సిన రూ .1.75 లక్షల నిర్వహణ ఖర్చులను చెల్లించనందుకు సుప్రీంకోర్టు ఈ శిక్షను విధిస్తూ ఉత్తర్వులను జారీచేసింది. భర్తకు ఇప్పటికే చాలాసార్లు అవకాశమిచ్చామని.. విడిపోయిన భార్యకు నిర్వహణ ఖర్చులు చెల్లించడానికి ఆయన ఉపయోగించుకోలేదని కోర్టు తెలిపింది. ఈమేరకు చీఫ్ జస్టిస్ ఎస్ఎ. బోబ్డే, జస్టిస్ ఎఎస్ బోపన్న, వి రామసుబ్రమణియన్ల ధర్మాసనం ఈ విధంగా తీర్పునిచ్చారు.

ఆ వ్యక్తి ఫిబ్రవరి 19 న ఇచ్చిన ఉత్తర్వులను పాటించలేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. కోర్టు ముందుగా నిర్ణయించిన తీర్పు ప్రకారం.. నెలవారీ నిర్వహణ ఖర్చులతోపాటు.. మొత్తం నగదు చెల్లించడానికి అతనికి ఇదే చివరి అవకాశమని తెలిపింది. టెలికాం రంగంలో జాతీయ భద్రత ప్రాజెక్టులో పనిచేస్తున్న ఆ వ్యక్తి తన వద్ద డబ్బు లేదని.. కోర్టు ప్రకటించిన మొత్తాన్ని చెల్లించడానికి రెండేళ్ల సమయం కోరాడు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు ఆదేశాన్ని పాటించడంలో పదేపదే విఫలమవడం ద్వారా విశ్వసనీయతను కోల్పోయాడని, ఈ తరహా కేసు ఉన్న వ్యక్తి జాతీయ భద్రత ప్రాజెక్టులో ఎలా సంబంధం కలిగి ఉన్నాడని ఆశ్చర్యపోతున్నామంటూ ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. విడాకులు తీసుకున్నప్పుడు భార్యకు భరణం చేల్లించడం.. భర్త కర్తవ్యమని తెలిపింది.

తమిళనాడు దంపతులకు చెందిన ఈ కేసు 2009 నాటిది. భర్త వేధింపులు తాళలేక భార్య.. భర్తపై పలు సెక్షన్ల కింద కేసు వేసింది. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు.. నెలవారీగా భరణం కింద రూ .1.75 లక్షలు చెల్లించాలని పేర్కొంది. అప్పటినుంచి భర్త భరణం చెల్లించకోపోడంతో ఆ మహిళ హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. అప్పటినుంచి విచారణ సాగుతున్నప్పటికీ ఆ వ్యక్తి భరణం చెల్లించలేదు. దీంతో న్యాయస్థానం 2009 నుంచి బకాయిలుగా ఉన్న సుమారు రూ .2.60 కోట్లు చెల్లించాలని, దీంతోపాటు ప్రతినెల 1.75లక్షలు ఇవ్వాలని పేర్కొంది. అంతకుముందు కోర్టు జారీ చేసిన ఒక ఉత్తర్వును కూడా పాటించలేదని, రెండు-మూడు వారాల్లోపు ఈ చెల్లింపులు చేయకపోతే ఆ వ్యక్తిని జైలుకు పంపాలని న్యాయస్థానం అధికారులను జారీ చేసింది.

Also Read:

IND vs ENG 3rd ODI: వన్డే సిరీస్‌ కూడా భారత్‌దే.. చివరి వన్డేలో ఇంగ్లాండ్‌పై ఘన విజయం‌