బిహార్‌లో ఓ విద్యార్థి హాల్‌టికెట్‌పై అతని తల్లిదండ్రుల పేర్ల స్థానంలో బాలీవుడ్ స్టార్స్ ఇమ్రాన్ హష్మీ, బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ పేర్లు ఉన్నాయి. ఆ హాల్ టికెట్ కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ హాల్ టికెట్.. హాట్ బ్యూటీ సన్నీ లియోన్ కంట పడింది. అది చూసి షాక్ అయిన సన్నీ.. కూల్‌గా రెస్పాండ్ అయ్యింది. ‘ఈ పిల్లాడు సూపర్. పెద్ద కలలకు ఇది మార్గం.. హహహహ’ అంటూ ఫోటోను రీట్వీట్ చేసింది అమ్మడు. సన్నీ రీ ట్వీట్ చేయడంతో ఈ ఫోటో మరింత వైరల్ అవుతోంది. దీనికి ముందు ఇమ్రాన్ హష్మీ కూడా ఈ హాల్ టికెట్‌పై స్పందించాడు. ‘ప్రామిస్‌గా చెబుతున్నాను. నాకు ఎలాంటి సంబంధం లేదు’ అంటూ చమత్కరించాడు. కాగా, విద్యార్థి పరీక్ష హాల్ టికెట్‌పై ఇమ్రాన్ హష్మి, సన్నీ లియోన్ పేర్లు ఎలా వచ్చాయనే దానిపై సంబంధిత యూనివర్సిటీ అధికారులు విచారణకు ఆదేశించారు కూడా. ప్రస్తుతం దానిపై విచారణ జరుగుతోంది. వివరాలు ఇచ్చిన విద్యార్థి తప్పిదమా?, అధికారుల నిర్లక్ష్యమా? అనే విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు ఉన్నతాధికారులు.
This kids awsome !!!!! Way to dream big :)))))))) XO hahahaha https://t.co/VEkTnsv4VT
— sunnyleone (@SunnyLeone) December 12, 2020