మాడు పగిలే ఎండలు ఇంకా తగ్గకపోవడంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఇచ్చిన వేసవి సెలవులను పొడిగించింది. వాస్తవానికి జూన్ 1 నుంచి 6-10 తరగతులకు, జూన్ 5వ తేదీ నుంచి 1-5 తరగతులకు స్కూళ్లు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వేసవి తాపం తగ్గకపోవడంతో ఆ సెలవులను ఇవాళ్టి వరకు పొడిగించారు. కానీ భానుడి భగభగలు ఇంకా అలాగే ఉండటంతో ఈ నెల 11వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు సీఎం స్టాలిన్ వెల్లడించారు. 2023-24 విద్యాసంవత్సరానికి గానూ 6-10 తరగతులకు, ఇంటర్ విద్యార్ధులకు జూన్ 12, 1-5 తరగతులకు జూన్ 14 నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి.