హత్రాస్ జిల్లాకు రాహుల్, ప్రియాంక గాంధీ ‘లాంగ్ మార్చ్ ‘

యూపీలోని హత్రాస్ కు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గురువారం  'లాంగ్ మార్చ్' ప్రారంభించారు. ఈ  జిల్లాలో 20 ఏళ్ళ యువతి దారుణ హత్యాచారానికి గురికాగా, ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు వారు బయల్దేరారు. అయితే వీరి రాకను..

హత్రాస్ జిల్లాకు రాహుల్, ప్రియాంక గాంధీ లాంగ్ మార్చ్

Edited By:

Updated on: Oct 01, 2020 | 3:56 PM

యూపీలోని హత్రాస్ కు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గురువారం  ‘లాంగ్ మార్చ్’ ప్రారంభించారు. ఈ  జిల్లాలో 20 ఏళ్ళ యువతి దారుణ హత్యాచారానికి గురికాగా, ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు వారు బయల్దేరారు. అయితే వీరి రాకను పసిగట్టిన యూపీ ప్రభుత్వం ఈ జిల్లాకు దారి తీసే అన్ని మార్గాలనూ మూసివేసింది. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసింది. మీడియాకు కూడా నో ఎంట్రీ అని స్పష్టం చేసింది. హత్రాస్ కు దారి తీసే గ్రేటర్ నోయిడా వద్ద కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ కార్యకర్తల వాహనాల కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికి హత్రాస్ చేరుకోవాలంటే ఇంకా 142 కి. మీ. దూరం వెళ్లాల్సి ఉంటుంది. కానీ.. రాహుల్, ప్రియాంక తమ పట్టు వీడలేదు. తమ వాహనాల నుంచి దిగి వారు కాలినడకనే ఈ జిల్లాకు లాంగ్ మార్చ్ మొదలు పెట్టారు. వందలాది పార్టీ కార్యకర్తలు వారిని అనుసరిస్తూ, దారి పొడవునా యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ కి వ్యతిరేక నినాదాలతో భారీ ర్యాలీని తలపించారు.

గత ఏడాది దాదాపు ఇదే సమయంలో ఉన్నావ్ బాలిక దారుణ ఘటనకు నిరసనగా తాము ఆందోళన చేశామని, ఇప్పుడు మళ్ళీ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ మాత్రం మారలేదని కనిపిస్తోందని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.