ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన స్పైస్ జెట్ నిచ్చెన

ముంబై విమానాశ్రయంలో బలమైన ఈదురు గాలులు అతలాకుతలం చేస్తున్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆగివున్న ఇండిగో విమానాన్ని స్పైస్‌ జెట్‌కు చెందిన లాడర్‌ (నిచ్చెన) ఢీకొట్టింది.

ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన స్పైస్ జెట్ నిచ్చెన

Edited By:

Updated on: Jun 06, 2020 | 4:34 PM

ముంబై విమానాశ్రయంలో బలమైన ఈదురు గాలులు అతలాకుతలం చేస్తున్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆగివున్న ఇండిగో విమానాన్ని స్పైస్‌ జెట్‌కు చెందిన లాడర్‌ (నిచ్చెన) ఢీకొట్టింది. దీంతో ఇండిగో విమానం రెక్కలు కాస్త ధ్వంసమయ్యాయి. అంతేకాదు.. ఇంజిన్‌ భాగం కూడా కాస్త దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన శనివారం ఉదయం
చోటుచేసుకుంది. ముంబైలో ఉదయం బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం పడటంతో నగరమంతా తడిసిముద్దైంది. ఈ క్రమంలో బలమైన గాలుకు నిచ్చెన ఉన్న ప్రాంతం నుంచి కదలడంతో.. అది కాస్త అక్కడే పార్కింగ్ చేసి ఉన్న ఇండిగో విమానం రెక్కకి తగిలింది. అయితే ఘటన జరిగిన సమయంలో రెండు సంస్థలకు చెందిన విమానాలు అక్కడే పార్కింగ్ చేసి ఉన్నాయి.

ఇక ఇదే విషయంపై స్పైస్ జెట్ అధికారి స్పందిస్తూ.. ఉదయం 7.30 గంటలకు బలమైన గాలులు వీచాయని.. ఆ సమయంలో సంస్థకు చెందిన నిచ్చెన కదిలిపోయి.. ఇండిగో సంస్థకు చెందిన విమానం కుడివైపు రెక్కను తగిలిందని తెలిపారు.

Follow Us