గన్ చూపి…స్పైస్ జెట్ విమాన పైలట్ ను దోపిడీ చేసిన దొంగలు

ఢిల్లీ లోని ఐఐటీ ఫ్లై ఓవర్ వద్ద స్పైస్ జెట్ విమానం పైలట్ ను దోపిడీ దొంగలు దోచుకున్నారు. యువరాజ్ టెవాతియా అనే ఈ పైలట్ గురువారం తెల్లవారు జామున ఒంటిగంట ప్రాంతంలో..

గన్ చూపి...స్పైస్ జెట్ విమాన పైలట్ ను దోపిడీ చేసిన దొంగలు

Edited By:

Updated on: Jun 04, 2020 | 10:45 AM

ఢిల్లీ లోని ఐఐటీ ఫ్లై ఓవర్ వద్ద స్పైస్ జెట్ విమానం పైలట్ ను దోపిడీ దొంగలు దోచుకున్నారు. యువరాజ్ టెవాతియా అనే ఈ పైలట్ గురువారం తెల్లవారు జామున ఒంటిగంట ప్రాంతంలో ఫరీదాబాద్ లోని తన ఇంటినుంచి విమానాశ్రయానికి వెళ్తుండగా.. ఈ ఫ్లై ఓవర్ వద్దకు రాగానే టూ వీలర్స్ పై వఛ్చిన సుమారు పదిమంది దోపిడీ దొంగలు కారును ఆపి ఆయనపై దాడి చేశారు. ఆయన కారు అద్దాలు ధ్వంసం చేశారు. కత్తితోను, గన్ మడమతోను ఆయనను తీవ్రంగా గాయపరచి ఆయన తాలూకు వస్తువులతో బాటు 34 వేల రూపాయలు దోచుకున్నారు. రక్తమోడుతూ కారులోనే సొమ్మసిల్లిన యువరాజ్ అతి కష్టం మీద పోలీసులకు ఫోన్ చేశారు. క్రైమ్ స్పాట్ కి పోలీసులు వచ్ఛే లోగానే దుండగులు పారిపోయారు. గతంలోకూడా ఈ ప్రాంతంలో రాత్రుళ్ళు ఈ ముఠా ఇక్కడ  పలువురిని దోచుకున్నట్టు  తెలిసింది. యువరాజ్ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us