స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారికి జనం నుంచి ఎదురవుతోన్న విచిత్ర విన్నపం…!

|

Nov 16, 2020 | 11:54 AM

ఎన్నికలలో పోటీ చేసేవారికి ప్రజల నుంచి అనేక రకాల విన్నపాలు ఎదురవుతుంటాయి. వాటిల్లో కొన్ని చిత్రవిచిత్రమైనవి కూడా ఉంటాయి.. ఇప్పుడు కేరళలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి..

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారికి జనం నుంచి ఎదురవుతోన్న విచిత్ర విన్నపం...!
Follow us on

ఎన్నికలలో పోటీ చేసేవారికి ప్రజల నుంచి అనేక రకాల విన్నపాలు ఎదురవుతుంటాయి. వాటిల్లో కొన్ని చిత్రవిచిత్రమైనవి కూడా ఉంటాయి.. ఇప్పుడు కేరళలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి.. అక్కడి వయనాద్‌ ప్రజలకు కోతులు పెద్ద సమస్యగా మారాయి.. మర్కటాల చేష్టలతో వారు వేగలేకపోతున్నారు.. ఇప్పుడు ఓటు కోసం వచ్చేవారికి కోతుల సమస్యనే చెప్పుకుంటున్నారు.. వానరాల బెడదను శాశ్వతంగా తప్పించిన వారికే ఓటేస్తామని తీర్మానించేశారు.. కాల్‌పెట్ట మున్సిపాలిటీలోని హరితగిరి రెసిడెన్స్‌ అసోసయేషన్‌ ఈ మేరకు ఓ తీర్మానం చేసింది.. అక్కడ రాజకీయ పార్టీల బ్యానర్ల కంటే తమ బాధను చెప్పుకుంటూ వీరు పెట్టుకున్న బ్యానర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి.. మరి కోతులు అంతగా వేధిస్తున్నాయి వీరిని! ఇళ్లపై పెంకులు తీసేస్తూ వంటగదిలోకి జొరబడుతున్నాయి.. వండుకున్న తిండినంతా ఎత్తుకెళుతున్నాయి.. కోతుల కారణంగా తిండితిప్పలు నిద్రహారాలు మానేయాల్సి వస్తుంది అక్కడివారికి! ఎప్పట్నుంచో ఉన్న ఈ కోతుల సమస్యకు ఇప్పటి వరకు ఎవరూ పరిష్కారం చూపలేదని వాపోతున్నారు జనం.