రీల్స్ పిచ్చి ఎంత పనిచేసింది? బాణసంచా నిప్పుతో రైతుకు భారీ నష్టం! ఐదు ఎకరాలు బూడిద!

సోషల్ మీడియాలో రీల్స్ చేయాలనే సరదా ఓ రైతు కుటుంబానికి తీరని నష్టాన్ని మిగిల్చింది. యువకులు రీల్స్ కోసం కాల్చిన బాణసంచా నిప్పురవ్వలు పక్కనే ఉన్న చెరకు తోటకు అంటుకోవడంతో ఐదు ఎకరాల పంట పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో చోటుచేసుకుంది.

రీల్స్ పిచ్చి ఎంత పనిచేసింది? బాణసంచా నిప్పుతో రైతుకు భారీ నష్టం! ఐదు ఎకరాలు బూడిద!
Reels Turn Costly

Updated on: Nov 13, 2026 | 12:54 PM

మహారాష్ట్ర: సోషల్ మీడియాలో రీల్స్ చేయాలనే సరదా ఓ రైతు కుటుంబానికి తీరని నష్టాన్ని మిగిల్చింది. యువకులు రీల్స్ కోసం కాల్చిన బాణసంచా నిప్పురవ్వలు పక్కనే ఉన్న చెరకు తోటకు అంటుకోవడంతో ఐదు ఎకరాల పంట పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో చోటుచేసుకుంది.

రీల్స్ కోసం బాణసంచా.. బూడిదైన చెరకు తోట!

నాందేడ్ జిల్లాలోని మార్లక్ గ్రామంలో కొంతమంది యువకులు రోడ్డుపై సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో పొలం సమీపంలో బాణసంచా కాల్చినట్లు తెలుస్తోంది. వాటి నుంచి వెలువడిన నిప్పురవ్వలు సమీపంలోని రైతు మాణిక్రావ్ షిండేకు చెందిన చెరకు తోటపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎండిన ఆకుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో సుమారు ఐదు ఎకరాల్లోని చెరకు పంట పూర్తిగా కాలిపోయింది.

రైతుకు కన్నీళ్లే మిగిలాయి!

నెలల తరబడి కష్టపడి సాగు చేసిన పంట కళ్లముందే బూడిద కావడంతో రైతు మాణిక్రావ్ షిండే తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇప్పటికే వ్యవసాయంలో అనేక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రైతుకు ఈ ఘటన కోలుకోలేని దెబ్బగా మారింది. రీల్స్ పేరుతో బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. బాధిత రైతుకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

కొన్ని క్షణాల సోషల్ మీడియా సరదా.. ఓ రైతు ఏడాది కష్టాన్ని బూడిద చేసింది. మరి ఈ నష్టానికి బాధ్యత ఎవరిది? రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us