
యూపీలో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. సాధారణంగా బైక్‌కు హెల్మెల్ మనకు ఫైన్ ఎంత పడుతుంది. రూ.100 లేదా 200, కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం ఏకంగా రూ.20లక్షల చలాన్ విధించారు ట్రాఫిక్ పోలీసులు. పోలీసులు వేసిన చలాన్ ఆ వాహనం ధర కంటే రూ.20 రెట్లు ఎక్కవ. ముజఫర్‌నగర్ జిల్లాకు చెందిన ఒక వాహనదారుడు హెల్మెట్ ధరించనందుకు ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానా ఇది. హెల్మెల్ ధరించనందుకు తనకు రూ.20.74లక్షల జరిమానా విధించినట్టు పోలీసుల నుంచి వచ్చిన మెసేజ్ చూసిన ఆ వాహనదారులు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఆ తర్వాత దాన్ని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్‌నగర్ జిల్లాలోని న్యూ మండి ప్రాంతంలో మంగళవారం ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సరిగ్గా అదే సమయంలో ఒక వాహనదారులు తన స్కూటీపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తుండడంతో అతన్ని ఆపి వాహనం పేపర్స్ చూపించమని అడిగారు. కానీ అతను పోలీసులకు ఎలాంటి పేపర్స్ చూపించలేదు. దీంతో పోలీసులు అతని వాహనం స్వాధీనం చేసుకొని అతనికి రూ.రూ. 20.74 లక్షల చలాన్ విధించారు. అది చూసిన అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చలాన్ ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీయడంతో ముజఫర్‌నగర్ ట్రాఫిక్ పోలీసు సూపరింటెండెంట్ దానిపై స్పందించారు. చలాన్ జారి చేసిన అధికారి పొరపాటు కారణంగా ఇలా జరిగిందని ఆయన తెలిపారు. ఎంవీ యాక్ట్ 207 ప్రకారం కేసు నమోదు చేశామని, అధికారి 207 తర్వాత ఎంవీ యాక్ట్ అని టైప్ చేయడం మర్చిపోవడం వల్ల ఈ పొరపాటు జరిగిందన్నారు. ఈ కారణంగా రూ. 4,000 జరిమానా కాస్తా రూ. 20,74,000గా నమోదైందని వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.