Blackmail: రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాకు చెందిన ఓ యువకుడితో ఒక్క రాత్రిలోనే లక్షల రూపాయల సొమ్మును పోగొట్టుకున్నాడు. మాయలేడి ఇచ్చిన ట్విస్ట్‌కు లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అజ్మీర్‌లోని చౌరాసియావాస్ రోడ్లో నివసిస్తున్న ఒక యువకుడికి సోషల్ మీడియాలో ఖుషి వర్మ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరియం కాస్తా డీప్‌గా వెళ్లిపోయింది. ఇద్దరూ తమ తమ మొబైల్ నెంబర్లను మార్చుకున్నారు. యువతితో ఫోన్లో మాట్లాడిన తరువాత వీడియో కాల్ చేస్తానని చెప్పగా.. అవతలివైపున యువతి ఓకే చెప్పింది. ఇంకేముంది మనోడు రెచ్చిపోయి వీడియో కాల్ చేశాడు. అంతటితో ఆగకుండా దుస్తులు విప్పలాంటూ తనలోని కోరికలను మెల్ల మెల్లగా వెలిబుచ్చాడు.
అసలే మాయలేడి, ఆమెకు కావాల్సింది కూడా అదే కాబట్టి. ఓకే అంది. బాధిత యువకుడు సైతం దుస్తులు తీసేసి వీడియో కాల్లో మాట్లాడాడు. అయితే, ఆ మాయలేడి దీన్నంతటినీ రికార్డ్ చేసింది. సెకన్ల వ్యవధిలోనే ప్లేటు పిరాయించి.. బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టింది. తనకు డబ్బులు పంపించాలని డిమాండ్ చేసింది. లేదంటే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసింది. దాంతో బెదిరిపోయిన బాధిత యువకుడు.. మొదట రూ.5,100 పంపాడు. ఆ తరువాత మళ్లీ రూ.10 వేలు అడిగితే అవి కూడా పంపాడు. అలా ఒక్క రాత్రిలోనే మొత్తం రూ.1.30 లక్షలు ఈ మాయ లేడి లాగేసింది. ఇక లాభం లేదనుకున్న బాధిత యువకుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద ముఠానే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Also read:
Big News Big Debate: అణ్వస్త్రాలను రష్యా మోహరించిందా? పుతిన్ ప్రకటనలు కీడు శంకిస్తున్నాయా?
Shocking: తన భర్తను వలలో వేసుకుందని యువతిపై మహిళ ఆగ్రహం.. గుప్పిట కారం తీసుకుని ఏం చేసిందంటే..
Kajal Viral Video: తగ్గేదేలే అంటున్న అందాల చందమామ.. గర్భవతి అయినప్పటికీ.. వైరల్ వీడియో..!