బీజేపీలో చేరిన షాహీన్ బాగ్ నిరసనకారులు, కుట్రే అంటున్న ఆప్

| Edited By: Pardhasaradhi Peri

Aug 17, 2020 | 7:48 PM

లోగడ పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా షాహీన్ బాగ్ వద్ద ధర్నా చేపట్టిన ఆందోళనకారుల్లో సుమారు 50 మంది బీజేపీలో చేరారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించి కాషాయ పార్టీ..

బీజేపీలో చేరిన షాహీన్ బాగ్ నిరసనకారులు, కుట్రే అంటున్న ఆప్
Follow us on

లోగడ పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా షాహీన్ బాగ్ వద్ద ధర్నా చేపట్టిన ఆందోళనకారుల్లో సుమారు 50 మంది బీజేపీలో చేరారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించి కాషాయ పార్టీ పన్నిన కుట్రే ఇదని  సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఆరోపిస్తోంది. సీఏఏకి వ్యతిరేకంగా ఢిల్లీ షాహీన్ బాగ్ వద్ద  గతంలో 101 రోజులపాటు నిరసనకారులు టెంట్లు, షామియానాలు వేసి ధర్నా నిర్వహించారు. అయితే ఢిల్లీ పోలీసులతో చేతులు కలిపిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో లబ్ది పొందేందుకే వారిచేత ధర్నా చేయించిందని ఆప్ నేతలు దుయ్యబట్టారు. బీజేపీ నాయకుల ఆదేశాల మేరకే పోలీసులు నాటి నిరసనకారులపై ఎలాంటి చర్యా తీసుకోలేదని , అక్కడి నుంచి వారిని తొలగించలేదని వారన్నారు.

కాగా బీజేపీలో చేరిన షాహీన్ బాగ్ నిరసనకారుల్లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. మొత్తానికి ఇది పెద్ద కుట్ర అని ఆప్ ఆరోపించింది.