సభ్య సమాజం తలదించుకునే సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. మంచి మాటలు బోధించాల్సిన ఓ స్వామీజీ.. ఆయన హితబోధ చేస్తాడని వెళ్లిన ఓ ఇద్దరు మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని పంచకుల ప్రాంతంలోని కల్కాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కల్కాలో ఉన్న ఓ ఆశ్రమంలో బోధనలు చేస్తున్న ఓ స్వామీజీ వద్దకు.. హిమాచల్ ప్రదేశ్‌కు రాష్ట్రంలోని బద్ది ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు వచ్చారు.
అయితే బోధనలు చేస్తున్న ఆ స్వామీజీకి ఈ ఇద్దరు మైనర్లపై కన్ను పడింది. దీంతో అతడు స్వామీజీ అన్న విషయం మరిచిపోయి.. అతనిలోని కామాంధుడు బయటపడ్డాడు. ఆ ఇద్దరు మైనర్ బాలికలను బంధించి.. వారిపై మూడు రోజుల పాటు పలు మార్లు అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధిత బాలికలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం సదరు బాలికలను ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పంచకులలోని ఆశ్రమంలో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.