జైల్లో ఉన్న ఖైదీలు MLA, MPగా పోటీ చేయొచ్చా? చట్టం ఏం చేబుతుందంటే..

జైళ్లలో ఉన్న విచారణ ఖైదీలకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ ప్రశాంత్ భూషణ్ అనే వ్యక్తి ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం దేశ వ్యాప్తంగా చర్చణీయాంశంగా మారింది. ప్రస్తుత చట్టం ప్రకారం జైలులో ఉన్న ఖైదీలు ఓటు వేయలేరు. కానీ వారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అయితే ఇందుకు..

జైల్లో ఉన్న ఖైదీలు MLA, MPగా పోటీ చేయొచ్చా? చట్టం ఏం చేబుతుందంటే..
Voting Rights For Prisoners

Updated on: Oct 16, 2025 | 8:55 PM

దేశంలోని వివిధ జైళ్లలో ఉన్న విచారణ ఖైదీలకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ ప్రశాంత్ భూషణ్ అనే వ్యక్తి ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం దేశ వ్యాప్తంగా చర్చణీయాంశంగా మారింది. ప్రస్తుత చట్టం ప్రకారం జైలులో ఉన్న ఖైదీలు ఓటు వేయలేరు. కానీ వారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అయితే ఇందుకు విరుద్ధంగా.. భారత జైళ్లలో విచారణలో ఉన్న ఖైదీలకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవడం రాజకీయాల్లో ఓ మైలురాయిగా నిలవనుంది. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్ తరపున వాదిస్తున్నారు.

దీనిలో ఓటు హక్కును తిరస్కరించడం ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు. అలాగే ఈ అసమానతను తొలగించడానికి జైళ్లలో పోలింగ్ కేంద్రాలను తెరవాలని లేదా పోస్టల్ బ్యాలెట్లను ఏర్పాటు చేయాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. భారత చట్టం ప్రకారం, ఖైదీలకు ఓటు వేసే, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రజాప్రాతినిధ్య చట్టానికి లోబడి ఉంటుంది. ప్రస్తుత చట్టం ప్రకారం జైలులో ఉన్న వ్యక్తి, విచారణలో ఉన్న వ్యక్తి అయినా లేదా దోషిగా తేలినా, ఓటు వేసే హక్కు ఉండదు. 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 62(5) స్పష్టంగా జైలులో లేదా కస్టడీలో ఉన్న వ్యక్తికి ఓటు హక్కు ఉండదని స్పష్టం చేస్తుంది. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి లేదా బెయిల్/పెరోల్‌పై బయటకు వచ్చిన వ్యక్తికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

అయితే జైలులో ఉన్న వ్యక్తి కొన్ని షరతులకు లోబడి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఇదే చట్టం చెబుతుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం1951 ప్రకారం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడని, అప్పీలు పెండింగ్‌లో లేని వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. అయితే ఎవరైనా 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించినట్లయితే, శిక్ష పూర్తయిన తర్వాత కూడా తదుపరి 6 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. జైలు నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి, ఓటు వేయడానికి వీలు కల్పించే అసమానతను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవడం సర్వత్రా చర్చణీయాంశంగా మారింది. కాబట్టి, దీనిపై కోర్టు తీర్పు ఏం వస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

గమనిక: ఈ వార్త కోర్టు పిటిషన్లు, చట్టపరమైన నిబంధనల ఆధారంగా రూపొందించబడింది. మీకు ఏదైనా సందేహం ఉంటే అర్హత కలిగిన న్యాయవాదిని సంప్రదించగలరు.

మరిన్ని జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.