SBI Customers Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ టోల్‌ ఫ్రీ నెంబర్ల ద్వారా ఐదు రకాల సేవలు

|

Aug 26, 2021 | 1:19 PM

SBI Customers Alert: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్‌ వ్యవస్థ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన వినియోగదారులకు ఎన్నో సేవలు అందిస్తోంది. కరోనా..

SBI Customers Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ టోల్‌ ఫ్రీ నెంబర్ల ద్వారా ఐదు రకాల సేవలు
Follow us on

SBI Customers Alert: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్‌ వ్యవస్థ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన వినియోగదారులకు ఎన్నో సేవలు అందిస్తోంది. కరోనా మహహ్మారి కారణంగా వినియోగదారులకు మరింత సులభమైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఇక తాజాగా కస్టమర్లకు బ్యాంకింగ్‌ అవసరాల నిమిత్తం టోల్‌ ఫ్రీ నెంబర్లను అందుబాటులో ఉంచింది.  ఈ నెంబర్ల ద్వారా వివిధ రకాల సేవలు పొందవచ్చు. ఎస్‌బీఐ టోల్‌ ఫ్రీ1800 112 211 లేదా 1800 425 3800 డయల్ చేయడం ద్వారా పలు సమస్యలు పరిష్కరించుకోవచ్చు.  అలాగే ఈ సేవలు మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డులు, ఇతర బ్యాంకింగ్‌ విషయాలలో ఈ నెంబర్ల ద్వారా పొందవచ్చు. ఈ మేరకు ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది. బ్యాంకు వినియోగదారులు ఇంట్లోనే ఉండి సేవలు పొందవచ్చు. ఇది కాంటాక్ట్‌ లెస్‌ బ్యాంకింగ్‌ సేవలు పొందడానికి ఎస్‌బీఐ ఈ నెంబర్లను కేటాయించింది. ఈ టోల్‌ఫ్రీ ద్వారా అందించే సేవలు ఏంటంటే..

► బ్యాంకు ఖాతాకు సంబంధించిన బ్యాలెన్స్‌, మీ చివరి ఐదు లావాదేవీలు.

► ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా బ్యాలెన్స్‌ , చివరి ఐదు లావాదేవీలు పొందవచ్చు.

► ఏటీఎం కార్డును బ్లాక్‌ చేయడం, తిరిగి కొత్త కార్డు కోసం అభ్యర్థ కోసం ఆ టోల్‌ ఫ్రీ నెంబర్లను ఉపయోగించుకోవచ్చు.

► ఏటీఎం పిన్‌ను జనరేట్‌ చేసుకోవడం.

► మీ పాత ఏటీఎం బ్లాక్‌ చేసిన తర్వాత తిరిగి కొత్త కార్డును పొందడం.

కాగా, కరోనా మహమ్మారి కారణంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ సదుపాయాలను తీసుకువచ్చింది. ఇంకేమైనా సందేహాలుంటే వినియోగదారులు ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇలా ఎస్‌బీఐ ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. ప్రభుత్వం కరోనా కేసులు తగ్గినా.. థర్డ్‌వేవ్‌ ఎఫెక్ట్‌ మరింతగా ఉండే అవకాశం ఉండటంతో ఈ టోల్‌ ఫ్రీ సేవలు ఉపయోగించుకోవాలని ఎస్‌బీఐ సూచిస్తోంది.

 

ఇవీ కూడా చదవండి:

Reserve Bank Of India: మరో సహకార బ్యాంకుకు భారీ జరిమానా విధించిన రిజర్వ్‌ బ్యాంకు.. కారణం ఇదే..!

Positive Pay System: యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఇక నుంచి నిబంధనలు మారనున్నాయి.. తప్పక తెలుసుకోండి.!