మేఘాలయకు బదిలీ అయిన గోవా గవర్నర్

గోవా రాష్ట్రానికి గవర్నర్‌గా వ్యవహరిస్తున్న సత్యపాల్‌ మాలిక్‌ను మంగళవారం నాడు బదిలీ అయ్యింది. మేఘాలకు గవర్నర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఉత్వర్వులు జారీ చేశారు. ఇక గోవా రాష్ట్రానకి ప్రస్తుతం..

మేఘాలయకు బదిలీ అయిన గోవా గవర్నర్

Edited By:

Updated on: Aug 18, 2020 | 2:01 PM

గోవా రాష్ట్రానికి గవర్నర్‌గా వ్యవహరిస్తున్న సత్యపాల్‌ మాలిక్‌ను మంగళవారం నాడు బదిలీ అయ్యింది. మేఘాలకు గవర్నర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఉత్వర్వులు జారీ చేశారు. ఇక గోవా రాష్ట్రానకి ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న భగత్ సింగ్ కోష్యారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గోవా రాష్ట్రానికి కూడా గవర్నర్‌గా కోష్యారీ అదనపు బాధ్యతలు చేపట్టాలని రాష్ట్రపతి భవన్ ఆదేశించింది. మేఘాలయ గవర్నర్‌గా తథాగతరాయ్ బాధ్యతలు చేపట్టి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలోతథాగతరాయ్ స్థానంలో సత్యపాల్ మాలిక్‌ను రాష్ట్రపతి బదిలీ చేశారు.