Russia Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. యూరఫ్ దేశాలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన భారత్..

|

Apr 26, 2022 | 8:32 PM

ఉక్రెయిన్ సంక్షోభం యూరప్‌ను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభ విషయంలో యూపియన్ దేశాల వైఖరి, వాటి విధానం భిన్నంగా ఉందని విదేశాంగ మంత్రి ధ్వజమెత్తారు.

Russia Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. యూరఫ్ దేశాలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన భారత్..
S Jaishankar
Follow us on

Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై యూరోపియన్ తీరు ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. రష్యా ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో భారతదేశం వైఖరికి సంబంధించి యూరప్ లేవనెత్తుతున్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభం యూరప్‌ను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం విషయంలో యూపియన్ దేశాల వైఖరి, వాటి విధానం భిన్నంగా ఉందని విదేశాంగ మంత్రి ధ్వజమెత్తారు.

రైసినా డైలాగ్ ఫోరమ్ నుండి మూడు యూరోపియన్ దేశాల విదేశాంగ మంత్రుల ప్రశ్నలకు సమాధానమిస్తూ విదేశాంగ మంత్రి జైశంకర్ ఆఫ్ఘనిస్తాన్ సమస్యను లేవనెత్తారు. ఉక్రెయిన్‌లో ఏమి జరుగుతుందో ముఖ్యం, కానీ ఆఫ్ఘనిస్తాన్‌లో ఏమి జరిగిందో ప్రపంచ క్రమంలో ఏ ప్రమాణం ద్వారా సమర్థించబోమని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం దృక్కోణం స్పష్టంగా ఉంది. హింసను తక్షణమే నిలిపివేయాలని, ఈ దిశగా పరిష్కారం మార్గం కనుగొనాలన్నారు.

ఉక్రెయిన్ అంశంపై నార్వే, స్వీడన్, లక్సెంబర్గ్ విదేశాంగ మంత్రులు అడిగిన ప్రశ్నలపై విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. భారత్ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. హింసను తక్షణమే నిలిపివేయాలని ఇదివరకే స్పష్టం చేశామన్నారు. రెండు దేశాల మధ్య పరిష్కారం కనుగొనడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు జరగాలని కోరుకుంటున్నామన్నారు. ప్రస్తుతం యూరప్, పాశ్చాత్య దేశాలకు ఇది అత్యంత తీవ్రమైన సమస్య అని అర్థం చేసుకోవచ్చు. కానీ, మనమందరం మన స్వంత పరిస్థితులకు అనుగుణంగా మన ప్రాధాన్యతలను సెట్ చేసుకోవాలి. దీని వెలుపల కూడా ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలని జైశంకర్ అభిప్రాయపడ్డారు.

ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఉదహరిస్తూ ఆసియా పసిఫిక్‌కు ముప్పును చూపించే ప్రయత్నాలకు భారత విదేశాంగ మంత్రి తగిన సమాధానం కూడా ఇచ్చారు. ఆసియా పసిఫిక్‌కు ఎలాంటి ముప్పు ఉండదని జైశంకర్ అన్నారు. గత కొన్నేళ్లుగా ఆసియా ప్రాంతంలో ఉగ్రవాదం, ఐక్యరాజ్యసమితి నిబంధనలను విస్మరించడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. మేము దానిని ఎదుర్కొంటున్నాము. కానీ యూరప్ ఇప్పుడు దాని గురించి ఆందోళన చెందుతోంది. ఎందుకంటే ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా, వారు ప్రమాదాన్ని దగ్గరగా అనుభవిస్తున్నారు. కాబట్టి యూరప్ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని మేల్కొంటే మంచిదని జైశంకర్ సూచించారు.

Read Also…  Telangana Group 1: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది.. పూర్తి వివరాలివే..