పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. దాంతో.. పలు ప్రాంతాల్లో నగదు, బంగారం భారీగా పట్టుబడుతోంది. లెక్కాపత్రం లేని నగదు కోట్లలో కట్టలు కట్టలుగా వాహనాల్లో తరలిపోతోంది. ఓటర్లకు పంపిణీ చేసేందుకు తమదైనశైలిలో నగదును తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కర్నాటకలోని బళ్లారిలో ఐదున్నర కోట్ల నగదు, కేజీల కొద్ది బంగారం, వెండి పట్టుబడ్డాయి. బళ్లారి నగరంలోని బ్రూస్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేయగా.. కారులో భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నగదు తరలిస్తున్నవారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే..మూడు కిలోల బంగారం, 103 కిలోల ఆభరణాల వెండి కూడా కారులో దొరికింది. బళ్లారి కార్పెట్ బజార్‌లో ఎలాంటి పత్రాలు లేకుండా డబ్బు, నగలు తరలిస్తున్నట్లు గుర్తించారు అధికారులు.
Bellary, Karnataka: 5 crore in cash, silver, and gold were seized from a house in a police raid. The Bellary police conducted the raid at the house of Naresh Gold Shop in Bellary's Kambali Bazaar. pic.twitter.com/jM8vWxn5mP
— IANS (@ians_india) April 7, 2024
తమిళనాడులోనూ…
మరోవైపు.. తమిళనాడులోనూ ఎన్నికల తనిఖీల్లో నగదు, బంగారం భారీగా పట్టుబడుతోంది. తాజాగా.. చెన్నై సమీపంలోని తాంబరంలో 4 కోట్ల రూపాయల నగదు దొరకడం సంచలనంగా మారింది. చెన్నై నుంచి తిరునల్వేలి వెళ్తున్న నెల్లై ఎక్స్‌ప్రెస్‌లో పెద్దయెత్తున నగదు ట్రావెల్ అవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో తాంబరం రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేశారు. దాంతో.. నాలుగు కోట్ల నగదు పట్టుబడింది. ముగ్గుర్ని అరెస్ట్ చేసి.. నగదు సీజ్ తర్వాత.. ఐటీ అధికారులకు అప్పగించారు. ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు తిరునల్వేలి బీజేపీ ఎమ్మెల్యే, ప్రస్తుత లోక్‌సభ అభ్యర్థి నయనార్ నాగేంద్రన్ తీసుకురమ్మనట్లు పట్టుబడినవారు పోలీసులకు చెప్పడంతో గుట్టురట్టు అయింది. దాంతో.. పట్టుబడ్డ నగదు నాగేంద్రన్‌కి చెందినదిగా గుర్తించారు. పట్టుబడిన మనీతో నయనార్ నాగేంద్రన్‌కు లింకు ఉన్నట్లు తేలడంతో ఎన్నికల అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఈ కేసులో అరెస్టైనవారు ఇచ్చిన సమాచారంతో నాగేంద్రన్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..