67 క్రిమినల్‌ కేసులున్నా ఎమ్మెల్యే అయ్యారు..!

|

Nov 11, 2020 | 11:35 AM

మీసం మెలేస్తున్న వ్యక్తి పేరు అనంత్‌సింగ్‌.. ఈయనపై 67 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.. ఇప్పుడాయన రాష్ట్రీయ జనతాదళ్‌ ఎమ్మెల్యే!

67 క్రిమినల్‌ కేసులున్నా ఎమ్మెల్యే అయ్యారు..!
Follow us on

మీసం మెలేస్తున్న వ్యక్తి పేరు అనంత్‌సింగ్‌.. ఈయనపై 67 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.. ఇప్పుడాయన రాష్ట్రీయ జనతాదళ్‌ ఎమ్మెల్యే! బీహార్‌లోని మొకామా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనంత్‌సింగ్‌ జనతాదళ్‌ యునైటెడ్‌ అభ్యర్థి రాజీవ్‌ లోచన్‌ నారాయణ్‌ను ఓడించారు. ఆ నియోజకవర్గంలో అనంత్‌సింగ్‌కు మంచి హవానే ఉంది.. క్రితంసారి అంటే 2015లో ఇదే నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా నిలబడి విజయం సాధించడమే అందుకు నిదర్శనం. అన్నట్లు 2015 ఎన్నికలకు కొద్దిగా ముందు పాట్నాలోని ఆయన నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాలో ఏకే 47 గన్‌తో పాటు ఆరు మ్యాగజైన్లు, రైఫిల్స్‌, రక్తపు మరకలు అంటిన దుస్తులుబయటపడ్డాయి.. దాంతో కొంతకాలం జైల్లో ఉండాల్సి వచ్చింది.. జైల్లో ఉండటం ఈయనకు అలవాటే.. కిడ్నాప్‌, హత్య కేసుల్లో కూడా జైలుకు వెళ్లివచ్చారు అనంత్‌సింగ్‌. స్థానిక ప్రజలు ఈయనను చోటే సర్కార్‌ అని పిల్చుకుంటారు. అనంత్‌సింగ్ మొదటిసారి 2005లో మోకామా నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ త‌ర్వాత 2015, 2020 ఎన్నిక‌ల్లోనూ విజయం సాధించారు. ఎన్నిక‌ల ఆఫిడ‌విట్‌లో ప్రకటించుకున్న ఆస్తుల మొత్తం విలువ 68.6 కోట్ల రూపాయలు..