Airport Attack: రియాద్ విమానాశ్రయంపై దాడి.. నలుగురు భారతీయులు ఐసీయూలో.. కేంద్రం కీలక ప్రకటన

Airport Attack: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన భారతీయుల ఆరోగ్య పరిస్థితిపై భారత విదేశాంగ శాఖ కీలక వివరాలు వెల్లడించింది. అక్టోబర్ 10, 2026న జరిగిన ఈ ఘటనలో గాయపడిన భారతీయుల్లో ఒకరు చికిత్స పొందుతూ మరణించగా

Airport Attack: రియాద్ విమానాశ్రయంపై దాడి.. నలుగురు భారతీయులు ఐసీయూలో.. కేంద్రం కీలక ప్రకటన
Mea

Updated on: Oct 14, 2026 | 9:28 PM

Airport Attack: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన భారతీయుల ఆరోగ్య పరిస్థితిపై భారత విదేశాంగ శాఖ కీలక వివరాలు వెల్లడించింది. అక్టోబర్ 10, 2026న జరిగిన ఈ ఘటనలో గాయపడిన భారతీయుల్లో ఒకరు చికిత్స పొందుతూ మరణించగా, మరో నలుగురు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన బాధితులకు కూడా వైద్యసేవలు అందుతున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) బుధవారం వెల్లడించింది.

దాడిలో ఏం జరిగింది?

సౌదీ అరేబియాలోని రియాద్‌ విమానాశ్రయంపై అక్టోబర్ 10న జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారు. వారిలో 11 మంది భారతీయులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ యూసుఫ్‌ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటనలో గాయపడినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.

ప్రస్తుతం భారతీయుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?

అక్టోబర్ 14న భారత విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. నలుగురు భారతీయులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అలాగే మరో నలుగురు సాధారణ వార్డుల్లో వైద్యసేవలు పొందుతున్నారని తెలిపింది. అలాగే ముగ్గురు చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, ఒకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించింది.

దాడిలో గాయపడిన 11 మంది భారతీయుల్లో ప్రస్తుతం ఎనిమిది మంది ఆసుపత్రుల్లోనే ఉన్నారు. బాధితులకు అందుతున్న చికిత్సను భారత రాయబార కార్యాలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వారి కుటుంబాలతోనూ సంప్రదింపులు కొనసాగిస్తున్నారు

భారత ప్రభుత్వం ఏం చెబుతోంది?

సౌదీ అరేబియాలో పౌరులపై, పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి దాడులను వెంటనే నిలిపివేయాలని కోరింది. సౌదీ అరేబియా ప్రజలకు, ప్రభుత్వానికి భారత్‌ సంఘీభావం ప్రకటించింది. బాధిత భారతీయులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది. ప్రస్తుత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో సౌదీ అరేబియాలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us