మొహర్రం ఎఫెక్ట్.. కశ్మీర్‌లో మళ్లీ కర్ప్యూ..

| Edited By:

Sep 09, 2019 | 12:25 PM

జమ్ముకశ్మీర్‌లో మళ్లీ కర్ప్యూ విధించారు. రేపు జరగబోయే మొహర్రం పండగ సందర్భంగా పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందన్న సమాచారంతో ఆంక్షలు విధించారు. శ్రీనగర్‌తో పాటు కశ్మీర్ లోయలోని పలు పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు. శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌తో పాటు.. పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మొహరించారు. లాల్‌చౌక్ ప్రాంతానికి ఫెన్సింగ్ వేసి.. మొహర్రం ఊరేగింపులు నిర్వహించకుండా చేశారు. మొహర్రం ఊరేగింపులను నిషేధించిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా పలు నగరాల్లో ఆంక్షలు విధించారు. వైద్య సేవల […]

మొహర్రం ఎఫెక్ట్.. కశ్మీర్‌లో మళ్లీ కర్ప్యూ..
Follow us on

జమ్ముకశ్మీర్‌లో మళ్లీ కర్ప్యూ విధించారు. రేపు జరగబోయే మొహర్రం పండగ సందర్భంగా పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందన్న సమాచారంతో ఆంక్షలు విధించారు. శ్రీనగర్‌తో పాటు కశ్మీర్ లోయలోని పలు పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు. శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌తో పాటు.. పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మొహరించారు.

లాల్‌చౌక్ ప్రాంతానికి ఫెన్సింగ్ వేసి.. మొహర్రం ఊరేగింపులు నిర్వహించకుండా చేశారు. మొహర్రం ఊరేగింపులను నిషేధించిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా పలు నగరాల్లో ఆంక్షలు విధించారు. వైద్య సేవల కోసం వెళ్లేవారికి పాసులను జారీ చేశామని.. వారిని బయటకు వచ్చేందుకు అనుమతిస్తున్నామని పోలీసులు తెలిపారు. కర్ఫ్యూ నేపథ్యంలో పలు నగరాలు, పట్టణాల్లో వ్యాపారసంస్థలు, దుకాణాలు, మార్కెట్లు మూతపడ్డాయి. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మాజీ సీఎంలు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. వారితో పాటుగా కశ్మీర్ వేర్పాటు వాదులను కూడా నిర్భందంలోనే ఉంచారు.