RBI Rap Song: ఆర్థిక మోసాలపై ఆర్బీఐ వినూత్న అవగాహన.. వీడియో సాంగ్‌ విడుదల.. సోషల్‌ మీడియాలో వైరల్‌

|

Feb 19, 2021 | 6:19 PM

RBI Rap Song: దేశంలో బ్యాంకింగ్‌ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నూతన టెక్నాలజీ సాయంతో సైబర్‌ నేరగాళ్లు ప్రజలను నిలువునా మోసగిస్తున్నారు. అయితే మోసాలు పెరిగిపోతుండటంతో..

RBI Rap Song: ఆర్థిక మోసాలపై ఆర్బీఐ వినూత్న అవగాహన.. వీడియో సాంగ్‌ విడుదల.. సోషల్‌ మీడియాలో వైరల్‌
Follow us on

RBI Rap Song: దేశంలో బ్యాంకింగ్‌ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నూతన టెక్నాలజీ సాయంతో సైబర్‌ నేరగాళ్లు ప్రజలను నిలువునా మోసగిస్తున్నారు. అయితే మోసాలు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కూడా ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకు ఒక ర్యాప్‌ వీడియో సాంగ్‌ను రూపొందించి సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. సెంట్రల్‌ బ్యాంక్‌ అధికారికంగా విడుదల చేసిన ఈ ర్యాప్‌ సాంగ్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ప్రజలకు వివిధ రకాల మోసాలపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేసేందుకు RBI Says అనే పేరుతో ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలను ఓపెన్‌ చేసింది. వీటి ద్వారానే ఆర్బీఐ బ్యాంకు లావాదేవీలకు సంబంధించి సూచనలు చేస్తోంది. దీంతో పాటు మోసపూరిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వివిధ భాషల్లో ప్రకటనలు విడడుదల చేస్తోంది. తాజాగా ఈ ట్విట్టర్‌ అకౌంట్‌లోనే ఆర్బీఐ ర్యాప్‌ సాంగ్‌ను షేర్‌ చేసింది.

వీడియోలో ఏముంది..?

ఈ వీడియోలో ఒక ర్యాపర్‌ బ్యాంకింగ్‌ మోసాల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. వన్‌ టైమ్‌ పాస్‌ వర్డులు, పిన్‌ నంబర్‌, అకౌంట్‌ వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సింగర్‌ పాటలో తెలిపాడు. మోసపూరిత ఫోన్‌ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. ఇంకా బ్యాంక్‌ మోసాలపై మరిన్ని వివరాలతో పాట రూపంలో అందించారు.