చుట్టు వరదతో అడవుల్లో చిక్కుకున్న ముగ్గురు గర్భిణులు.. ఆపద్భాంధవులుగా రక్షించిన రెస్క్యూటీం

రైతుల పొలాలు, పంటలు పూర్తిగా నీటమునిగిపోయాయి. ఇళ్లు, పంటలు తడిసిపోయి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షం కారణంగా 3 గర్భిణులు అడవిలో చిక్కుకుపోయారు..

చుట్టు వరదతో అడవుల్లో చిక్కుకున్న ముగ్గురు గర్భిణులు.. ఆపద్భాంధవులుగా రక్షించిన రెస్క్యూటీం
Heavy Rains

Updated on: Aug 06, 2022 | 9:03 AM

కేరళలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో 2 వేల మందికి పైగా ప్రజలు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళలోని కోజికోడ్ జిల్లాలో జలదిగ్బంధం నెలకొంది. రైతుల పొలాలు, పంటలు పూర్తిగా నీటమునిగిపోయాయి. ఇళ్లు, పంటలు తడిసిపోయి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షం కారణంగా 3 గర్భిణులు అడవిలో చిక్కుకుపోయారు.. అటవీశాఖ, పోలీసుల సహకారంతో వారిని సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు.. అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదే సమయంలో వారిలో ఒకరు అడవిలోనే ఆడపిల్లకు జన్మనిచ్చింది. సమాచారం ప్రకారం..తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

అడవిలో చిక్కుకుపోయిన వారిలో మరో ఇద్దరు కాబోయే తల్లులు..ఒకరు ఆరు నెలలు, మరోకరు ఏడు నెలల గర్భిణులు. జిల్లా వైద్యాధికారి నేతృత్వంలోని బృందం ముగ్గురికి భరోసా కల్పించింది. తర్వాత వారిని చాలకుడి తాలూకా ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ బృందం ఫ్లాట్‌బోట్‌ను ఉపయోగించి వారిని రక్షించింది.

పెరింగల్‌కుత్ ద్వారా రెండు కిలోమీటర్ల సాహసయాత్రను కవర్ చేసింది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఈ ఘటనను గమనించి గర్భిణులను రక్షించిన బృందాన్ని అభినందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి