Rajasthan Fire: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 7 మంది సజీవ దహనం!

రాజస్థాన్‌ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. భివాడిలోని ఓ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో సుమారు 8 మంది కార్మికులు మంటల్లో సజీవ దహనమయ్యారు. మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను హాస్పిల్‌కు తరలించారు పోలీసులు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 25 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. అయితే గార్మెంట్ ఫ్యాక్టరీ పేరుతో అక్కడ టపాసులు తయారు చేస్తున్నారని.. ప్రమాదానికి అదే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు..

Rajasthan Fire: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 7 మంది సజీవ దహనం!
Rajasthan Factory Fire

Updated on: Feb 16, 2026 | 9:19 PM

రాజస్థాన్‌లోని భివాడి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 8 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని అంబులెన్స్‌ సహాయంతో హాస్సిటల్‌కు తరలించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాస్తవానికి గార్మెంట్స్‌ తయారీ ఫ్యాక్టరీతో లైసెన్స్‌ తీసుకొన్ని.. అక్కడ అక్రమంగా బాణాసంచా ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఫ్యాక్టరీలో బాణాసంచా తయారు చేస్తుండగా ఆకస్మాత్తుగా పేలుడు జరిగిందని. ఈ ఘటనపై రాజస్థాన్‌ ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తకు ఆదేశించిందని తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక బృందాలు దాదాపు రెండు గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందని.. రెస్క్యూ బృందాలు ఘటన స్థలంలో ఏడుగురి మృతదేహాలను వెలికితీశాయని తెలిపారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారని దీంతో మృతుల సంఖ్య 8కి చేరినట్టు స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ దిగ్బ్రాంతి

ఇక ఈ అగ్నిప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజస్థాన్‌లోని భివాడిలో జరిగిన అగ్ని ప్రమాదం విషాదకరమైనది. ఇది తీవ్ర బాధను కలిగించింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

రాజస్థాన్ సీఎం విచారం

రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఈ సంఘటనను హృదయ విదారకమైనదని పేర్కొన్నారు. భివాడిలోని ఖుష్ఖేడా పారిశ్రామిక ప్రాంతంలోని ఒక కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం చాలా హృదయ విదారకమైనది. సహాయ, రక్షణ కార్యకలాపాలు నిర్వహించాలని జిల్లా పరిపాలనను ఆదేశించాను. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని భజన్‌లాల్ శర్మ పేర్కొన్నారు. ఫోరెన్సిక్‌ నిపుణులు సంఘటా స్థలాన్ని పరిశీలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us