MLA Indira Meena Raids Tractor: రైతులకు మ‌ద్ద‌తుగా ట్రాక్ట‌ర్ న‌డుపుతూ అసెంబ్లీకి వచ్చిన మ‌హిళా ఎమ్మెల్యే

|

Feb 10, 2021 | 5:40 PM

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకూ తమ ఆందోళన విరమించమంటూ కొంత మంది..

MLA Indira Meena Raids Tractor: రైతులకు మ‌ద్ద‌తుగా ట్రాక్ట‌ర్ న‌డుపుతూ అసెంబ్లీకి వచ్చిన మ‌హిళా ఎమ్మెల్యే
Follow us on

MLA Indira Meena Raids Tractor : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకూ తమ ఆందోళన విరమించమంటూ కొంత మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం..చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది. ఇక గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్ట‌ర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. అంత‌ర్జాతీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరిగినా..ప్రతిష్టంభన నెలకొంది. కాగా, రైతుల ఉద్య‌మానికి దేశంలోని ప‌లు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి.

ఈనేపధ్యంలో తాజాగా రాజస్థాన్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇందిరా మీనా..వినూత్న రీతిలో రైతుల నిరసనకు మద్దతు  తెలిపారు. రైతులకు సంఘీభావంగా..ఆమె స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ..అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి  రైతులు చేస్తోన్న పోరాటానికి ఆమె మద్దతు తెలియచేశారు. అన్నదాతలు చేస్తోన్న పోరాటానికి మద్ద‌తు తెలిపేందుకే ఇలా ట్రాక్ట‌రుపై అసెంబ్లీకి వ‌చ్చాన‌ని ఇందిరా మీనా వెల్లడించారు. అంతేకాదు రెండు నెలలకు పైగా..రైతులు ఎన్నో కష్టాలు పడుతూ.. నిరసనలు తెలియచేస్తున్నారని ఎమ్మెల్యే ఇందిరా మీనా ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరా స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ..అసెంబ్లీకి వెళ్లుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Also Read: